🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 November 2026, 7:35 pm Posted by : Telangana Vaartha

జాతీయ ఉపాధి హామీ పథకంపై గ్రామసభ నిర్వహణ

News Image
గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్.
జోగులాంబ గద్వాల 17 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి.ఇటిక్యాల . మండలం ఉదండాపురం గ్రామంలోని పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గొల్ల మహేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై సోషల్ ఆడిట్ విషయంపై సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశంలో సోషల్ ఆడిట్ గురించి చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి
రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ ఆకే పోగు మై రాముడు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ఎల్ నీ నో కారణంతో వానలు కురియక పోవడంతో రైతుల ఎంతో నష్టపోయారనీ పంటల నష్టపరిహారం తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు.
రైతులకు అధికారులు సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగాధర్ రాజ్యాంగ పరిరక్షణ సమితి కన్వీనర్ మై రాముడు కో కన్వీనర్ అలెగ్జాండర్ మాజీ సర్పంచ్ దేవన్న ఇశ్రాయేలు పౌలన్న రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home