🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 November 2026, 7:32 pm Posted by : Telangana Vaartha

గంజాయి సేవించిన ముగ్గురికి వైద్య పరీక్షల్లో పాజిటివ్.. డీ

News Image
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వినియోగంపై పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి చర్యలు చేపడుతున్నారు.
ఇల్లందు డీఎస్పీ యు వెంకన్నబాబు మార్గనిర్దేశం లొ ఇల్లందు పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలు నిర్వహించగా, ముగ్గురికీ గంజాయి సేవించినట్లు పరీక్షల్లో నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల నివేదికల ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యల్లో భాగంగా ముగ్గురినీ ఇల్లందు మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. అనంతరం వారిని భద్రాచలంలోని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా ఇల్లందు సీఐ సురేష్ మాట్లాడుతూ, గంజాయి వంటి మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల వ్యక్తుల ఆరోగ్యం, భవిష్యత్తు, కుటుంబ జీవితం తీవ్రంగా ప్రభావితమవుతాయని తెలిపారు. మత్తు పదార్థాల వినియోగం వ్యక్తిగత జీవితానికే కాకుండా సమాజ భద్రతకు కూడా ముప్పుగా పరిణమిస్తుందని పేర్కొన్నారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ విద్య, ఉపాధి, ఉన్నత లక్ష్యాలపై దృష్టి సారించాలని సూచించారు. గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, వినియోగానికి పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మత్తు పదార్థాలకు బానిసైన వారు స్వచ్ఛందంగా డీ-అడిక్షన్ కేంద్రాల సేవలను వినియోగించుకుని వ్యసనాల నుంచి బయటపడాలని పోలీసులు సూచించారు.
కార్యక్రమం లొ SI లు ఉమ, పి ఎస్ పాణి మరియు సిబ్బంది లాల్ సింగ్,రవి, బాలు ప్రవీణ్ పాల్గొన్నారు
🏠 Home