🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 November 2026, 7:24 pm Posted by : Telangana Vaartha

ఆదివాసి యువకుడు తెల్లం శరత్ ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

News Image
అక్రమ నిర్మాణ లాడ్జిలను కూల్చివేయాలి .
ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అద్యక్షులు ముర్ల రమేష్ డిమండ్ .
తెలంగాణ వార్త నవంబర్ 17 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం దివ్య క్షేత్రం భద్రాచలం లో హత్య ఉదంతం చాల బాదాకరం . నిన్న రాత్రి రామాలయం ప్రాంతంలో రూమ్ కోసం లాడ్జి కి వెళ్లిన ఆదివాసి యూవకుడు(తెల్లం శరత్ )ని కులం పేరుతొ దూషించి , విచక్షణారహితంగా లాడ్జి యజమాని , సిబ్బంది హత్యచేయడం చాలాబాధాకరం . ప్రశాంతంగా ఉండే భద్రాచలంలో ఈ మధ్యకాలంలో ఇలంటి సంఘటనలు జరగటం భద్రాచలం ఉనికికే ప్రమాదం ఏర్పడు తు0దని,ఆదివాసి చట్టాలకు వ్యతిరేకంగా , నిబందనలు పాటించకుండా విచ్చలవిడిగా నిర్మించిన , నిర్మిస్తున్న లాడ్జిలను కూల్చివేయాలి . ఇంటువంటి సంఘటనలు జరగకుండ అధికారులు చర్యలు తీసుకొవాలి . బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆదివాసి కొండరెడ్ల సంఘం వారికి అండగ ఉంటుంది . ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్థాపక గౌరవ అధ్యక్షులు ముర్ల.రమేష్ పేర్కొన్నారు. శ్రీరాముని దివ్య క్షేత్రంలో భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ అధికారులు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.
🏠 Home