🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 17 November 2026, 8:04 am Posted by : జేరిపోతుల రాంకుమార్

ఎల్ నీలో నీ ఎదుర్కొని పర్యావరణాన్ని రక్షించుకుందాం

News Image
తిరుమలగిరి 17 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండలం చింతలకుంట తండా గ్రామంలో జిల్లా కలెక్టర్ సమాచార పౌర సంబంధాల అధికారుల ఆదేశానుసారం జిల్లాలోని ఎల్ నినో విపత్తుపై సాంస్కృతిక సారధి సూర్యాపేట జిల్లా కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించినారు అంతర్జాతీయ వాతావరణ సంస్థల ప్రకటన ప్రకారం 2026 ఎల్ నినో అత్యంత తీవ్రస్థాయి'సూపర్ ఎల్ నినో కు , ఇది 1950 తర్వాత అత్యంత శక్తివంతమైన పరిణామాలలో ఒకటిగా ఈ తీవ్ర ఎల్ నినో ప్రభావంతో భారతదేశం హై - రెస్క్యూ జోన్ లో చేర్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ డేబ్లుహెచ్ ఓ దీనిని గ్రేడ్ 3 హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది.ప్రస్తుత అంచనాల నేపథ్యంలో ప్రజలు, రైతులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అని సాంస్కృతిక సారథి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పాలకుర్తి శ్రీకాంత్ టీం లీడర్ గంట బిక్షపతి సమావేశములో మాట్లాడినారు. భారత వాతావరణ శాఖ విడుదల చేసినా వర్షపాతం, ఉష్ణోగ్రతల లను గమనించాలి. రైతులు స్థానిక వ్యవసాయ శాఖ సూచనల మేరకు పంటలు సాగు రూపొందించుకోవాలి.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం పరిస్థితులు తీవ్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఎల్ నినో ప్రభావం పసిఫిక్ మహాసముద్రంలోని వేడి గాలులు పెరగవచ్చు అని అంచనా వేసింది. ఈ పరిణామం ప్రపంచవ్యాప్తంగా ఎండలు కరువులు, వరదలు, వ్యవసాయ రంగంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. వ్యవసాయం ముఖ్యంగా వరి. పత్తి. పప్పు ధాన్యాలు, ఇతర వర్షాదారిత పంటలు సాగు చేసే రైతులు వాతావరణ పరిస్థితులను గమనించవలసి ఉంటుంది. నీటి కొరత ఏర్పడితే సాగు, పంట దిగుబడులు తగ్గడం వంటి సమస్యలు తలెచ్చవచ్చు వర్షపాతం పరిస్థితుల ఆధారంగానే అంచనా వేయాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పరిశాల పరిశుభ్రత గంజాయి డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి డి .శ్రీలత. సాంస్కృతిక సారథి కళాబృందం సభ్యులు, గడ్డం ఉదయ్, పల్లెల రాము, పల్లెల లక్ష్మణ్, పాక ఉపేందర్, మద్దిరాల మంజుల, కుందమల్ల నాగలక్ష్మి, ములకలపల్లి మల్లమ్మ, నెమ్మాది స్రవంతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు...
🏠 Home