ఆరుతడి పంటల సాగుతో అధిక లాభాలు పొందాలి
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు సమగ్ర వ్యవసాయ విధానాలను పాటిస్తూ, శాస్త్రవేత్తల సూచనలు మరియు ఆధునిక వ్యవసాయ మెలకువలను అనుసరించాలని కోరారు.
ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉండటంతో బోర్లలో నీటిమట్టం తగ్గిపోయిందని, బావుల్లో కూడా నీటి లభ్యత తక్కువగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వరి సాగు చేయరాదని, నీటి లభ్యతను బట్టి ఆరుతడి పంటలైన శనగ, కందులు, పెసలు, మినుములు వంటి పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. తక్కువ నీటితో అధిక ఆదాయం పొందే పంటలపై రైతులు దృష్టి సారించాలని ఆయన కోరారు.
ఆరుతడి పంటలు అయినటువంటి మినుములు వేరుసెనగ వేసుకునే రైతులకు ప్రభుత్వం సబ్సిడీలో స్ప్రింక్లర్లు అందిస్తుందని తెలియజేశారు అలాగే వరికి బదులుగా కూరగాయలు పండించుకున్న వారికి డ్రిప్ సబ్సిడీలో అందిస్తామని రైతులకు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్త డాక్టర్ అర్చన, టెక్నికల్ అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీలత, ఏఈఓ నరేష్ మరియు రైతులు మహిళ రైతులు పాల్గొన్నారు.