సూర్యాపేట బిడ్డకు జాతీయ గౌరవం - డా. ఆనందరావు వాఘ్మారేకు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు
సూర్యాపేట, నవంబర్ 16 సూర్యాపేట జిల్లా ముద్దుబిడ్డ, ప్రముఖ వైద్యులు, సామాజిక సేవకులు డా. ఆనందరావు వాఘ్మారే కి జాతీయ స్థాయిలో అత్యున్నత గౌరవం దక్కింది. భారత రాజధాని న్యూఢిల్లీలో నవంబర్ 15, 2026 నాడు జరిగిన జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవంలో ఢిల్లీ కరోల్ బాగ్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ విశేష్ రవి చేతుల మీదుగా ఆయనకు "బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు - 2026" ను ఘనంగా అందజేశారు.
డా. ఆనందరావు వాఘ్మారే కేవలం వైద్యులు మాత్రమే కాదు, మానవత్వానికి నిదర్శనం. గత 10 సంవత్సరాలుగా ఆయన చేస్తున్న సేవలు మహోన్నతమైనవి.
సొంత ఖర్చులతో అనాథాశ్రమాన్ని నిర్వహిస్తూ, పేద, అనాథ పిల్లలకు ఉచితంగా భోజనం, వసతి, పాఠశాల విద్య అందిస్తున్నారు.
నిరుద్యోగ యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ను ప్రారంభించారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఉచితంగా శిక్షణ, భోజనం, వసతి కల్పించి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు.
క్రమం తప్పకుండా ఉచిత వైద్య శిబిరాలు (హెల్త్ క్యాంప్స్) నిర్వహిస్తూ, వైద్యం చేయించుకోలేని పేద, నిరుపేదలకు ఉచితంగా చికిత్స అందిస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నారు.
ఈ విశేష సేవలను గుర్తించిన జాతీయ జ్యూరీ ఆయనను ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపిక చేసింది.
డా. ఆనందరావు వాఘ్మారే కి జాతీయ అవార్డు రావడంపై సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇది యావత్ తెలంగాణకే గర్వకారణమని పలువురు ప్రముఖులు కొనియాడుతున్నారు. సమాజానికి ఇలాంటి సేవలు మరిన్ని అందించాలని మనమందరం డాక్టర్ ని అభినందిస్తూ, ప్రోత్సహిద్దాం.