🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 16 November 2026, 1:56 am Posted by : A.Timma Gurudu

నిజాయితీ చాటిన ఆర్టీసీ సిబ్బంది.

News Image
మర్చిపోయిన సెల్‌ఫోన్‌ను ప్రయాణికురాలికి అప్పగింత.
జోగులాంబ గద్వాల 15 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- అయిజ నుంచి గద్వాలకు వస్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలు సెల్‌ఫోన్‌ను బస్సులో మర్చిపోయి రైల్వేస్టేషన్‌లో దిగిపోయారు. బస్సులో ఫోన్‌ను గుర్తించిన కండక్టర్ కిష్టన్న, డ్రైవర్ రాధాకృష్ణ వెంటనే కంట్రోలర్ వెంకటేష్‌కు సమాచారం అందించారు. అనంతరం ఫోన్‌ను సంబంధిత ప్రయాణికురాలికి సురక్షితంగా అందజేశారు. సిబ్బంది నిజాయితీని పలువురు అభినందించారు.
🏠 Home