🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 November 2026, 10:11 pm Posted by : Telangana Vaartha

ఘనంగా ఖమ్మం జోన్ స్థాయి నారాయణ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు

News Image
క్రీడలతో ఆరోగ్యం, క్రమశిక్షణ, సమిష్టి తత్వం – ఖమ్మం ఏ.జి.ఏం రాంకీ
ఖమ్మం:- నేడు ఖమ్మంలోని సర్దార్ వల్లభభాయ్ స్టేడియంలో నిర్వహించిన నారాయణ ప్రీమియర్ లీగ్ ఖమ్మం జోన్ స్థాయి క్రీడా పోటీల్లో నారాయణ స్కూల్స్ సత్తుపల్లి, ఖమ్మం, పాల్వంచ బ్రాంచ్‌ల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ పోటీల్లో విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి పలు బహుమతులు సాధించడం విశేషం. ఈ క్రీడా వేడుకలు వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల మార్చ్‌ఫాస్ట్, అతిధుల జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఖమ్మం ఏ.జి.ఏం రాంకీ, విశిష్ట అతిథులుగా హెచ్ ఆర్ సతీష్, శ్రీకాంత్, ఆర్ఐ క్రాంతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథి రాంకీ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా చురుకుగా పాల్గొనాలని సూచించారు. క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ , సమయపాలన, జట్టుగా పనిచేసే నైపుణ్యం, గెలుపోటములను సమానంగా స్వీకరించే మనస్తత్వాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తితో ముందుకు సాగి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ పోటీలలో కబడ్డీ, ఖో-ఖో, 100 మీటర్ల పరుగు పందెం, క్యారమ్స్, చెస్ తదితర క్రీడలను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ప్రిన్సిపాల్ నవీన్ కుమార్, పాల్వంచ బ్రాంచ్ ప్రిన్సిపాల్ పి.నరసింహారావు, సత్తుపల్లి ప్రిన్సిపాల్ రామ్మూర్తి, ఖమ్మం జోన్ కోఆర్డినేటర్లు ప్రవీణ్, వినోదలక్ష్మి, నీలిమ పాల్గొన్నారు. వివిధ బ్రాంచ్‌ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు . విద్యార్థులు సాధించిన విజయాలు నారాయణ పాఠశాలలకు గర్వకారణమని అతిథులు అభినందించారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులు , పిఈటీ , ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
🏠 Home