🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 November 2026, 8:58 pm Posted by : Telangana Vaartha

ద్విచక్ర వాహనంపై ఐదుగురు ప్రయాణం..

News Image
ముఖ్యమైన పాయింట్స్:విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటాం – సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి
సూర్యాపేట పట్టణంలో ద్విచక్ర వాహనంపై ఐదుగురు విద్యార్థులు ప్రయాణిస్తున్న విషయాన్ని గుర్తించిన ట్రాఫిక్ పోలీసులు వారిని ఆపి, తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి విద్యార్థులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు.
ఒకే ద్విచక్ర వాహనంపై పరిమితికి మించి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని, ఇలాంటి నిర్లక్ష్యపు చర్యల వల్ల వాహనదారులతో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరులు కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
మరోసారి ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడితే కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇచ్చే విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని, ట్రాఫిక్ నిబంధనలపై వారికి అవగాహన కల్పించాలని సూచించారు.
యువత, విద్యార్థులు సరదా కోసం చేసే నిర్లక్ష్యపు ప్రయాణాలు ప్రాణాల మీదకు తెస్తాయని, తమ ప్రాణాలతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టవద్దని ఎస్‌ఐ యాదవేందర్ రెడ్డి సూచించారు. రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత. ట్రాఫిక్ నిబంధనలు పాటించండి.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోండి.
🏠 Home