🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 November 2026, 8:26 pm Posted by : Telangana Vaartha

ఆశలకు 18 వేల రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలి....

News Image
ఎన్ కవిత ఆశ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ డిమాండ్
ఈరోజు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ నెక్కిర కంటి కవిత మాట్లాడుతూ ఆశాలకు 18000 ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని 50 లక్షల ప్రమాద బియ్యం సౌకర్యాన్ని కల్పించాలి ప్రతి ఆదివారం సెలవుతోపాటు పండుగ సెలవులు క్యాజువల్ లీవ్స్ వేతనంతో కూడిన సెలవులు 60 రోజులు ఇవ్వాలని రిటైర్మెంట్ నాటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు రెండో పి.ఆర్.సిలో ఆశాలకు 30000 రూపాయలు వేతనాలు నిర్ణయించాలని ఏఎన్ఎం ట్రైనింగ్ చేసిన ఆశలకు ప్రమోషన్ ఇవ్వాలని ఆశాలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆశా వర్కర్స్ నాయకురాలు p అరుణకుమారి, రాధా, g విజయ, భాగ్యలక్ష్మి, ఉమా, సరస్వతి, సుజాత, అనిత, సబితా, కాళమ్మ, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home