🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 14 November 2026, 7:12 pm Posted by : Telangana Vaartha

ఇన్‌స్పెక్టర్ల బదిలీలు

News Image
వరంగల్‌ కమిషనరేట్‌లో టాస్క్ ఫోర్స్ విభాగం లో పనిచేస్తున్న ఇన్‌స్పెక్టర్‌ కాసగాని శ్రీధర్‌ ములుగు జిల్లా వెంకటాపురం సర్కిల్‌కు బదిలీ అయ్యారు. అక్కడ విధుల్లో ఉన్న ముత్యం రమేశ్‌ను మల్టీజోన్‌-1 ఐజీ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఐజీపీ సంపత్‌ చంద్రశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ బోర్డు సిఫార్సుల మేరకు ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఐజీ కార్యాలయంలో వెయిటింగ్‌లో ఉన్న బొమ్మెర బాలకృష్ణ, రాడం భానుప్రకాశ్‌లకు ఇటీవల ఖమ్మం కమిషనరేట్‌లోని సీసీఆర్‌బీ, సీటీసీ విభాగాల్లో ఇచ్చిన పోస్టింగ్‌లను రద్దుచేసి, వారిని తిరిగి వెయిటింగ్‌లోనే కొనసాగించారు. పరిపాలనా కారణాలతోనే ఈ మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
🏠 Home