🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 November 2026, 8:10 pm Posted by : A.Timma Gurudu

కుళాయి నీళ్ళు వృధా చేస్తే కుళాయి కలెక్షన్ కట్

News Image
జోగులాంబ గద్వాల జిల్లా ​అయిజ మున్సిపాలిటీ ప్రజలకు తెలియజేయునది ఏమనగా, ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత తగ్గి, నీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ నీటిని పొదుపుగా వినియోగించి, క్రింది నిబంధనలు పాటించాలి:
​మున్సిపల్ అనుమతి లేకుండా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయరాదు.
​మున్సిపల్ పైప్‌లైన్‌కు మోటార్లు బిగించి నీటిని తోడరాదు. ఉల్లంఘించిన వారికి రూ.5,000 జరిమానా విధించబడుతుంది.
​కుళాయి నీటిని వృధా చేయరాదు. వినియోగం పూర్తయిన వెంటనే కుళాయిని బిగించాలి.
​మున్సిపల్ కుళాయి నీటితో కింది పనులు చేసినట్లయితే జరిమానా విధించబడుతుంది:
​కారు కడిగితే — రూ.5,000
​బైక్ కడిగితే — రూ.2,000
​ఇంటి ముందు నేలను కడిగితే — రూ.2,000
​ప్రతి కుళాయి కనెక్షన్‌కు బిబ్ ట్యాప్ తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
​నీటి వృధా లేదా అక్రమ వినియోగం గమనించినట్లయితే మున్సిపల్ నీటి సరఫరా లైన్ మెన్లు విభాగానికి తెలియజేయండి. నీటి కొరతను ఎదుర్కొనేందుకు ప్రజలందరూ సహకరించాలని కోరుతున్నాము.
ఇట్లు
అయిజ మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్ రావు...
🏠 Home