🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 November 2026, 8:06 pm Posted by : Telangana Vaartha

బాల సదనంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

News Image
జోగులాంబ గద్వాల 13 నవంబర్ 20 26 తెలంగాణ వార్త ప్రతినిధి.గద్వాల. : మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల ప్రభుత్వ బాల సదనంలో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిష్క పాత్రుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి బాలల దినోత్సవ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.

ఈ సందర్భంగా బాలలు నిర్వహించిన ఆటలు, పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులతో ముఖ్య అతిథి ఆప్యాయంగా ముచ్చటించి వారితో కొంత సమయం గడిపారు. ఈ కార్యక్రమంలో పి ఓ ఐ సి ఇన్‌చార్జ్ సురేష్, సీసీఐ మాట్రిన్ స్నేహ, చైల్డ్లైన్ కోఆర్డినేటర్ శివలీల, సిబ్బంది పద్మ, నవీన్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home