టీకాలపై అవగాహన
మాతా, శిశు ఆరోగ్య సంరక్షణకు ARMMAN (Advancing Reduction in Mortality & Morbidity of Mothers children & Neonates) తల్లులు, పిల్లలు మరియు నవజాత శిశువుల మరణాలను మరియు అనారోగ్య సమస్యలను తగ్గించే దిశగ ప్రత్యేక శిక్షణ--
గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నపిల్లల ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంతో పాటు, మాతా, శిశు మరణాల రేటును తగ్గించడమే లక్ష్యంగ అన్ని PHCల వైద్యాధికారులకు, MLHPలకు, మహిళా సూపర్వైజర్లకు, PHNలకు మరియు ANMలకు అందరికి ARMMAN సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
DM&HO- డా. సంధ్య కిరణ్మయి అధ్యక్షతన, PO-MHN డా. రాధిక పర్యవేక్షణలో, రాష్ట్ర JD-MHN- డా. సుధిర సమక్షంలో IDOC సమావేశ మందిరం కలెక్టర్ కార్యాలయం నందు ఈ కార్యక్రమం నిర్వహించబడింది.
ఈ శిక్షణలో గర్భిణుల ముందస్తు నమోదు, (High-Risk, ANCలను) ప్రమాదకర గర్భిణీలను గుర్తించడం, క్రమం తప్పకుండ ANC పరిక్షలు, రక్తహీనత నివారణ, పోషకాహారం, సురక్షిత ప్రసవం, ప్రసవానంతర తల్లి సంరక్షణ, తల్లిపాల ప్రాముఖ్యత, నవజాత శిశు సంరక్షణ, పిల్లల ఎదుగుదల మరియు పూర్తి స్థాయి టీకాలపై అవగాహన కల్పించారు.
అదేవిధంగ, ARMMAN మొబైల్ ఆధారిత సమాచార సేవల ద్వార గర్భిణులు, బాలింతలకు సకాలంలో ఆరోగ్య సమాచారం అందించే విధానాలను వివరించారు.
క్షేత్రస్థాయిలో ప్రతి తల్లి, శిశువు ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ, ప్రభుత్వ ఆరోగ్య సేవలు అందరికి చేరేల బాధ్యతాయుతంగ విధులు నిర్వహించాలని సూచించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో రాష్ట్ర ప్రోగ్రాం అధికారులు మరియు జిల్లా ప్రోగ్రామ్ అధికారులు డా. జి రాజు, డా. అస్గర్ అలీ, DPHNO- వరలక్ష్మి, SO- తిర్మల్ రెడ్డి, ఇంచార్జ్ మీడియ అధికారి- హీర్యనాయక్,DDM- రామాంజనేయులు మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.