🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 November 2026, 8:02 pm Posted by : A.Timma Gurudu

బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనపై అవగాహన

News Image
జోగులాంబ గద్వాల 2026 తెలంగాణ వార్త ప్రతినిధి.ఎర్రవల్లి. మండలం రాజశ్రీ గార్లపాడు గ్రామంలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలకు, మండల పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాలల రక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బాలల పరిరక్షణ అధికారి సురేష్ మాట్లాడుతూ బాల్య వివాహాలను అరికట్టడం, బాలలపై లైంగిక వేధింపులను నిరోధించడం, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పోక్సో చట్టం, సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్, సోషల్ మీడియా వల్ల కలిగే ప్రమాదాలు, ఆన్‌లైన్ భద్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పిల్లలు తమ సమస్యలను భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో పంచుకోవాలని సూచించారు.

బాల్యం భద్రంగా ఉంటేనే భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. బాలల హక్కులను కాపాడటం సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చైల్డ్‌లైన్ సూపర్‌వైజర్ నవీన్, పంచాయతీ కార్యదర్శి హిమబిందు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అంగన్‌వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home