🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 13 November 2026, 9:13 am Posted by : Alli prashanth kumar

కిరాణా దుకాణంలో బియ్యం అధిక రేట్లకు అమ్మరాదు

News Image
ముఖ్యమైన పాయింట్స్:*కిరాణా దుకాణాల్లో తనిఖీలు*
కిరాణా దుకాణాల్లో తనిఖీలు
వాజేడు తెలంగాణ వార్త రిపోర్టర్:- మండలంలోని వాజేడు నాగారం గ్రామంలో గురువారం కిరాణా దుకాణాలను అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారమే బియ్యం విక్రయించాలని, ప్రతి కిరాణా దుకాణం వద్ద బియ్యం ధరలకు సంబంధించిన పట్టికను ఏర్పాటు చేయాలని వాజేడు తహసీల్దార్ ఎస్. శ్రీనివాస్ సూచించారు. వినియోగదారులకు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం అందించాలని, ధరల విషయంలో పారదర్శకత పాటించాలని ఆయన స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో మండల గిర్దావర్ ఎన్. కుమారస్వామి, వాజేడు జీపీఓ జి. శంకర్, పేరూరు జీపీఓ ఎస్.కె. మున్వర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home