🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 November 2026, 7:44 pm Posted by : Telangana Vaartha

సైబర్ మోసం.. కూలీ డబ్బుల్లో లక్ష రూపాయలు మాయం

News Image
పెద్ద తండాకు చెందిన సురేష్ నాయక్‌కు ఆర్థిక నష్టం.. న్యాయం చేయాలని అధికారులకు వేడుకోలు జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల పరిధిలోని పెద్ద తండా గ్రామానికి చెందిన సురేష్ నాయక్ (తండ్రి జీవుల నాయక్) సైబర్ మోసానికి గురై లక్ష రూపాయలు కోల్పోయారు.
వివరాల్లోకి వెళ్తే.. సురేష్ నాయక్ గత ఆరు సంవత్సరాలుగా హైదరాబాద్‌లో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కూలీలకు డబ్బులు చెల్లించేందుకు తన బ్యాంకు ఖాతాను పరిశీలిస్తున్న సమయంలో ఒక మెసేజ్ రావడంతో, ఆ వ్యవహారంలో సైబర్ నేరగాళ్లు ఆయన ఖాతా నుంచి లక్ష రూపాయలు మాయం చేసినట్లు బాధితుడు తెలిపారు.
రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించిన డబ్బులు సైబర్ మోసగాళ్ల చేతిలో పోవడంతో బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సమగ్ర విచారణ జరిపి తనకు న్యాయం చేయడంతో పాటు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సురేష్ నాయక్ కోరుతున్నారు..
🏠 Home