🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 12 November 2026, 7:39 pm Posted by : Telangana Vaartha

అయిజ మున్సిపాలిటీలో నీటి ఎత్తిడి నివారణకు కీలక ప్రకటన

News Image
కుళాయిలకు మోటార్లు బిగిస్తే రూ. 5,000 జరిమానా.
కార్లు కడిగితే — రూ. 5,000 , బైకులు కడిగితే — రూ. 2,000, ఇంటి ముందు నేలను కడిగితే రూ. 2,000.
జోగులాంబ గద్వాల 12 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఐజ. మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలందరికీ మున్సిపల్ యంత్రాంగం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. రానున్న కాలంలో ఎల్‌నినో ప్రభావం వల్ల నీటి లభ్యత భారీగా తగ్గి, నీటి సరఫరాలో తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ మునుపటి సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రజలందరూ నీటిని అత్యంత పొదుపుగా వినియోగించాలని కోరారు. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ వారు కొన్ని కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చారు. మున్సిపల్ అనుమతి లేకుండా ఎవరూ అనధికారికంగా కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయరాదని, మున్సిపల్ పైప్‌లైన్‌కు నేరుగా మోటార్లు బిగించి నీటిని తోడకూడదని స్పష్టం చేశారు. ఈ నిబంధన ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా విధించబడుతుంది. అలాగే కుళాయి నీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ వృథా చేయరాదని, వాడకం పూర్తయిన వెంటనే కుళాయిని సరిగ్గా బిగించాలని సూచించారు. మున్సిపల్ కుళాయి నీటిని వినియోగించి కార్లు కడిగితే రూ. 5,000, బైకులు కడిగితే రూ. 2,000 మరియు ఇంటి ముందు నేలను కడిగితే రూ. 2,000 చొప్పున భారీగా జరిమానాలు విధిస్తారు. అంతేకాకుండా ప్రతి కుళాయి కనెక్షన్‌కు విధిగా 'బిబ్ ట్యాప్' ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా నీటి వృథా లేదా అక్రమ వినియోగం గమనించినట్లయితే వెంటనే మున్సిపల్ నీటి సరఫరా లైన్‌మెన్ల విభాగానికి సమాచారం అందించాలని కోరారు. రాబోయే కాలంలో నీటి కొరత ముప్పును సమష్టిగా ఎదుర్కొనేందుకు అయిజ మున్సిపాలిటీ ప్రజలందరూ అధికారులకు పూర్తిగా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు విజ్ఞప్తి చేశారు.
🏠 Home