🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 11 November 2026, 8:58 pm Posted by : Telangana Vaartha

గోదావరి పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేయాలి

News Image
ముఖ్యమైన పాయింట్స్:– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
వచ్చే ఏప్రిల్ నాటికి గోదావరి పుష్కరాల పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం
విఐపి లకు భక్తులకు ఇబ్బందులు కలగకుండా వేరువేరుగా సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం.
తెలంగాణ వార్త.నవంబర్ 11 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం.

రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని భద్రాచలంలోని గోదావరి నదీ తీర ప్రాంతాల్లో చేపడుతున్న ఘాట్ల అభివృద్ధి పనులు, ఆలయ పరిసరాల అభివృద్ధి మరియు ఇతర మౌలిక సదుపాయాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశించారు. బుధవారం నాడు భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనులు మరియు నూతన గోదావరి పుష్కర ఘాట్ నిర్మాణం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి దేవాదాయశాఖ కమిషనర్ హనుమంతరావు, జిల్లా కలెక్టర్ అంకిత్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట తో కలిసి సబ్ కలెక్టర్ కార్యాలయంలోని చాంబర్లో సంబంధిత జిల్లా అధికారులు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు, కన్సల్టెంట్లు, ఆర్కిటెక్టులు, కాంట్రాక్టర్లు మరియు కమిటీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమావేశంలో శాఖల వారీగా చేపట్టిన పనుల పురోగతి, ఇప్పటివరకు పూర్తయిన పనులు, ఇంకా చేపట్టాల్సిన పనులు, ఎదురవుతున్న సమస్యలు మరియు పనుల పూర్తి చేయడానికి అవసరమైన చర్యలపై సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ విదేశాల నుండి భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారిని దర్శించుటకు అవకాశం దొరుకుతుందని తప్పనిసరిగా గోదావరి పుష్కరాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, సురక్షితమైన స్థానాలు, ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాలు, రహదారులు, తాగునీటి సరఫరా, విద్యుత్ సదుపాయాలు, పారిశుధ్యం, డ్రైనేజీ, వైద్య సదుపాయాలు, భద్రత, రవాణా మరియు అగ్నిమాపక ఏర్పాట్లను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా పుష్కర వనం కోసం అనువైన స్థలం సేకరించాలని, విఐపి లకు భక్తులకు వేరువేరుగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని అలాగే భక్తుల కోసం డార్మెటరీలు సిద్ధం చేయాలని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దేవస్థానం అభివృద్ధి పనులతో పాటు పుష్కర ఘాట్ పనులకు కలిపి 348 కోట్ల 59 లక్షలు నిధులు విడుదల చేసినందున అన్ని శాఖల అధికారులు తమకు కేటాయించిన పనులను నిర్దేశిత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని, పనుల అమలులో ఎలాంటి జాప్యం జరగకుండా నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైన చోట శాఖల మధ్య సమన్వయం పెంపొందించుకుని, ఎదురయ్యే సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని తెలిపారు.
గోదావరి పుష్కరాల నిర్వహణకు భద్రాచలాన్ని అన్ని విధాలుగా సిద్ధం చేసే లక్ష్యంతో అధికారులు సమష్టి బాధ్యతతో పనిచేసి, అభివృద్ధి పనులన్నింటినీ శ్రీరామనవమి నాటికి పూర్తి చేయాలని, శాఖల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే జిల్లా కలెక్టర్ మరియు సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొని వచ్చి సమస్యలు పరిష్కరించుకోవాలని, పనులు మాత్రం ఆపవద్దని ఆమె అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో దామోదర్ రావు, ఆర్ అండ్ బి ఈ ఈ నాగేశ్వరరావు, డిపిఓ అనూష, ట్రాన్స్కో ఎస్సీ మహేందర్, డీఎంహెచ్ఓ తుకారం రాథోడ్, డి ఎ వో భగవాన్ రెడ్డి, తాసిల్దార్ రవికుమార్, భద్రాచలం సర్పంచ్ పూణేం కృష్ణ మరియు వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఎండ్
🏠 Home