ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలో తరగతులు ప్రారంభించాలి
రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్ రెడ్డి....
కోదాడ నియోజక వర్గంలోని చిలుకూరు గుట్టలలో రూ.200 కోట్లతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల, కోదాడ లో రూ.50 కోట్లతో నిర్మిస్తున్న నవోదయ పాఠశాల నిర్మాణ పనులను బుధవారం రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మంత్రి నల్లమాద
ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా మంత్రి చిలుకూరు గుట్టలో 200 కోట్ల రూపాయాలతో 22 ఎకరాలలో నిర్మాణం చేపడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల భవన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బేస్మెంట్, కాంక్రీట్, పిల్లర్ల పనుల పురోగతి, నిర్మాణం పై సంబంధిత గుత్తందార్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల వచ్చే విద్యా సంవత్సరం మొదలయ్యేలోగా పాఠశాల భవన నిర్మాణ పనులు పూర్తి చేసి, 2027–28 విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిం చుటకు సిద్ధం చేయాలని అన్నారు.
తదుపరి కోదాడ లో 50 కోట్ల రూపాయాలతో నిర్మిస్తున్న నవోదయ పాఠశాల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పనుల పురోగతిపై గుత్తందారులతో సమీక్షించారు. భవన నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి ప్రారంభించుటకు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ కే నరసింహ, ఆధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.