డిసెంబర్ చివరికల్లా రెడ్లకుంట ఎత్తిపోతల పనులు పూర్తి చేయాలి – మంత్రి ఉత్తమ్
పాలేరు వాగుపై రూ.47.64 కోట్లతో చేపట్టిన పథకం పనులు 70 శాతం పూర్తి
కాలువ, భూగర్భ మోటార్లు, సబ్‌స్టేషన్ పనులను పరిశీలించిన మంత్రి ఉత్తమ్
నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ మిగిలిన పనులను వేగవంతం చేయాలని గుత్తేదారులకు మంత్రి ఉత్తమ్ ఆదేశం
వానాకాలం, యాసంగి సీజన్లలో ఆరు గ్రామాల పరిధిలో 4,460 ఎకరాలకు సాగునీరు
ఒక్కోటి 430 కిలోవాట్ల సామర్థ్యం గల నాలుగు వీటీ మోటార్లతో నీటి ఎత్తిపోత
కాపుగల్లులో 1,608 ఎకరాలకు, నల్లబండగూడెంలో 1,400 ఎకరాలకు సాగునీరు
రెడ్లకుంటలో 576 ఎకరాలకు, చిమిరాలలో 410 ఎకరాలకు సాగునీరు
కూచిపూడిలో 400 ఎకరాలకు, ద్వారకుంటలో 66 ఎకరాలకు సాగునీరు
రెడ్లకుంట ఎత్తిపోతల పథకంతో మొత్తం 1,486 కుటుంబాలకు లబ్ధి
లబ్ధిదారుల్లో బీసీ 720, ఎస్సీ 446, ఓసీ 290, ఎస్టీ 30 కుటుంబాలు
పరిశీలనలో నల్లగొండ ఎంపీ కుందూరు రఘువీర్‌రెడ్డి, కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్, ఎస్పీ నరసింహ
గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, నీటిపారుదల శాఖ సీఈ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్ హాజరు
కార్యక్రమంలో అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొన్నారు
కోదాడ మండలం రెడ్లకుంట వద్ద పాలేరు వాగు పై నిర్మిస్తున్న రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులను బుధవారం రాష్ట్ర పౌర సరఫరాలు మరియు నీటి పారుదల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు ముందుగా మంత్రి కాలువ పనులను, అండర్ గ్రౌండ్ మోటర్ లను, సబ్ స్టేషన్ పనులను పరిశీలించారు.
తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఈ రెడ్ల కుంట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ 47.64 కోట్ల రూపాయలతో 4,460 ఎకరాలకు ఖరీఫ్, రబీ సీజన్లకు నీరు అందించడం జరుగుతుందని, ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కోదాడ మండలంలోని ద్వారకుంట గ్రామంలో 66 ఎకరాలకు, నల్లబండగూడెం గ్రామంలో 1400 ఎకరాలకు, కాపుగల్లు గ్రామంలో 1608 ఎకరాలకు, కూచిపూడి గ్రామంలో 400 ఎకరాలకు, రెడ్లకుంట గ్రామంలో 576 ఎకరాలకు మరియు చిమిరాల గ్రామంలో 410 ఎకరాలకు
430 KW VT సామర్థ్యం గల 4 మోటార్ల సహాయంతో సాగునీరు అందించడం జరుగుతుందని, మొత్తం గ్రామాలలో కలిపి కులాల వారిగా లబ్ధిదారులు ఓసి 290, బీసీ 720, ఎస్టి 30, ఎస్సీ 446 కుటుంబాలు ఉన్నాయని మొత్తం 1,486 కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని ప్రస్తుతం 70 శాతం పనులు పూర్తయ్యాయని మిగిలిన పెండింగ్ పనులను డిసెంబర్ చివరి నాటికి పూర్తి నాణ్యతతో ఎలాంటి లోపాలు లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి గుత్తందారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, గ్రంథాలయ చైర్మన్ వంగవీటి రామారావు, ఇరిగేషన్ సీఇ నాగభూషణం, మార్కెట్ కమిటీ చైర్మన్, అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.