🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 10 November 2026, 1:59 am Posted by : Telangana Vaartha

ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

News Image
సమ డెంటల్ ఆసుపత్రిలో అందుబాటులో అన్ని రకాల దంత వైద్య సేవలు
సమ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ సమ
సూర్యాపేట జిల్లా కేంద్రం.... పేదలు, నిరుపేదలు, మధ్య తరగతి ప్రజల కోసం నిర్వహించే ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సమ దంత వైద్యశాల డాక్టర్ సమ అన్నారు. ఆస్పత్రి 11వ వార్షికోత్సవ సందర్భంగా సోమవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించి మాట్లాడారు.మానవ శరీరంలో దంతాలు చాలా బలమైనవని దంత సమస్యలు ఎలాంటివి ఉన్న అజాగ్రత్త చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు. పేదలు నిరుపేదలు ఇలాంటి సమస్యలను నిర్లక్ష్యం చేస్తారని వారికి అందుబాటులో దంత వైద్యాన్ని ఉంచాలని ఆలోచనతో తమ ఆసుపత్రి ప్రతి వార్షికోత్సవం రోజున రెండు రోజులపాటు ఉచిత దంత వైద్య శిబిరాన్ని గత 11 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తాము సూర్యాపేటలోనే కాకుండా ఖమ్మం, నకిరేకల్, నల్లగొండ, మోత్కూరు, తిరుమలగిరి, నూతనకల, తుంగతుర్తి, నేరేడుచర్ల, హాలీయ, మునగాల, హుజూర్నగర్ ప్రాంతాల్లో మా ఆసుపత్రి బ్రాంచీలు ఉన్నాయని తెలిపారు. దంత సమస్యలకు సంబంధించిన అన్ని రకాల వైద్య సేవలు తమ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.ఈ నెల 9,10 తేదీలలో రెండు రోజులపాటు నిర్వహించే ఉచిత దంత వైద్య శిబిరాన్ని సూర్యాపేట పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. అలాగే దంత వైద్యానికి సంబంధించి సమస్యలుంటే 9063777867 నెంబర్ ను సంప్రదించాలని వారు కోరారు.
🏠 Home