🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 10 November 2026, 1:57 am Posted by : Telangana Vaartha

వార్డుల అభివృద్ధికి పెద్దపీట.. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

News Image
ముఖ్యమైన పాయింట్స్:సూర్యాపేట అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు తీసుకొస్తాం
సూర్యాపేట:- వార్డుల సమగ్ర అభివృద్ధే మున్సిపాలిటీ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 17వ వార్డు భగత్‌సింగ్ నగర్‌లో సీసీ రోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, ఇప్పటివరకు సూర్యాపేటలో 1,000 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసినట్లు తెలిపారు. అన్ని వార్డుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని హామీ ఇచ్చారు. సూర్యాపేట నగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి సూర్యాపేట అభివృద్ధికి రూ.100 కోట్ల నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అర్హులకు ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, స్థానిక కౌన్సిలర్ భైరబోయిన శ్రీదేవి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు రేగటి సైదులు, రాజేష్, వీరయ్య, మాల్సూర్, కుంచం రాజు, సైదులు, కృష్ణ, జానీ, సైదాచారి, వార్డు ఆఫీసర్ నాగార్జున, జవాన్ మహేష్, ఆర్పీలు లలిత, శాంత, సింధుజ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home