🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 10 November 2026, 1:56 am Posted by : Telangana Vaartha

సరిహద్దు తేలేవరకు పేరబోయిన గూడెం ఇసుక రీచ్ బంద్ చేయాలి

News Image
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామ ఇసుక రీచ్ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ధర్నా
సూర్యాపేట అదనపు కలెక్టర్ కు వినతి పత్రం అందజేత
సూర్యాపేట:- సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయిన గూడెం ఇసుక రీచ్ అక్రమాలను వెంటనే అరికట్టాలని నల్లగొండ జిల్లా శాలిగౌరారం మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరు శంకర్ రెడ్డి, చిత్తలూరు గ్రామ సర్పంచ్ గిరగాని వెంకన్న, చిత్తలూరు గ్రామ ఇసుకరీస్ కమిటీ అధ్యక్షులు భీమ గాని వెంకన్న డిమాండ్ చేశారు.సూర్యాపేట జిల్లా నాగారం మండలం పేరబోయిన గూడెం నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం చిత్తలూరు గ్రామాలమధ్య ఇసుక రీచ్ సరిహద్దులు నిర్ణయించాలని కోరుతూ చిత్తలూరు గ్రామ ఇసుక రీచ్ కమిటీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ప్రజావాణిలో అదనపు కలెక్టర్ బి.హరి సింగ్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేర బోయిన గూడేనికి చెందిన వారు చిత్తలూరు గ్రామ సరిహద్దు లోపల కు వచ్చి ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లడం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఆర్డీఓ, మైనింగ్ శాఖల అధికారులకు వినతి పత్రాలు అందజేసిన కానీ తమ సమస్యలు పరిష్కారం కాలేదని వాపోయారు. రెండు గ్రామాల మధ్య ఏర్పడ్డ వివాదాలు తీవ్ర రూపం దాల్చకుండా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చిత్తలూరు గ్రామ ఉపసర్పంచ్ యన్నమల్ల శంకర్, మాజీ సర్పంచ్ బొమ్మగాని రవి, కోఆప్షన్ సభ్యులు దాసరి దేవచిత్త, సుంకరి వినీత్, చిలువేరు కిరణ్, యర్ర లక్ష్మి, రాచమల్ల సైదమ్మ శంభయ్య, తేలుకుంట్ల జయమ్మ, పీరనాయకం జ్యోతి నరేష్, చిత్తలూరు గ్రామ రైతులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home