🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 10 November 2026, 12:04 am Posted by : Telangana Vaartha

నూతన ప్రజాస్వామిక విప్లవం తోనే సమూల మార్పు

News Image
ముఖ్యమైన పాయింట్స్:సిపిఐ (ఎంఎల్ ) రాష్ట్ర కార్యదర్శి భూతం వీరయ్య
ఖమ్మం, నవంబర్ 9 :- ప్రస్తుతం దేశంలో గాని ప్రపంచంలో గాని నెలకొన్న సకల సమస్యలకు నూతన ప్రజాస్వామ్య విప్లవంతోనే మార్పు సాధ్యమై పరిష్కారం చెందుతాయని సిపిఐ (ఎంఎల్ ) రాష్ట్ర కార్యదర్శి భూతం వీరయ్య అన్నారు. సోమవారం హోటల్ శ్రీధర్ కాన్ఫరెన్స్ హాల్లో ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు కర్ణ రామన్న అధ్యక్షతన చంద్ర పుల్లారెడ్డి 42వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా భూతం వీరయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తూ భారత విప్లవోద్యమ నాయకుడిగా రాణించిన చండ్ర పుల్లారెడ్డి సారధ్యంలో జరిగిన గోదావరి లోయ ప్రతిఘటన పోరాటం, వ్యవసాయ , సాయుధ ప్రక్రియ మేళవింపు ఆయన దార్శ నికతను చాటుతోందన్నారు. ఆనాడు ఆయన చెప్పిన దానిని అపహాస్యం చేసిన వారంతా నేడు అనుసరిస్తున్నారని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమాన్ని, దాని తీరుతెనులకు రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకతను చండ్ర పుల్లారెడ్డి ఆనాడే స్పష్టం చేశారని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం కొనసాగుతున్న బిజెపి విధానాలు, మోడీ సాగిస్తున్న ఆరాచకాలు, పెరుగుతున్న నిరుద్యోగం, ద్రవ్య లోభనం , మత దురభిమానాలు, అసమానతలు తదితర అనేక సామాజిక రుగ్మతలకు పెట్టుబడి దారి వ్యవస్థ కారణంగా అభివర్ణించారు . కమ్యూనిస్టు పార్టీ ఒక చీలిక నుండి మరో చీలికకు అలాగే విప్లవోద్య పార్టీ సైతం అనేక చీలికలుగా మారిందన్నారు. మారుతున్న కాలంలో మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో మార్పులు సహజంగా జరుగుతుంటాయని వీటన్నిటికీ, ఈ సమస్యల పరిష్కారం కు.... నూతన ప్రజాస్వామిక విప్లవం తో వచ్చే మార్పుతోనే సాధ్యపడుతుందన్నారు . ఏ ఐ ఎఫ్ టి యు రాష్ట్ర నాయకులు కర్ణ రామన్న , సిపిఐ (ఎంఎల్) మహబూబాబాద్ కార్యదర్శి కర్నాటి మల్లేష్ , రైతు కూలీ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి వేమూరి భాస్కర్, రాష్ట్ర నాయకులు గణితి కోటేశ్వరరావు , భద్రాద్రి - కొత్తగూడెం రైతు కూలీ సంఘం నాయకులు దారావత్ వెంకన్న , పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి మోకాళ్ళ పద్మ, నాయకురాలు జిన్న మంజుల , పి డి ఎస్ యు విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకురాలు కర్నాటి సౌమ్య లు మాట్లాడుతూ ప్రస్తుత దేశ కాలమాన పరిస్థితుల నేపథ్యంలో మరో విప్లవం రావాల్సిన అవసరం ఉందని , ఇందుకోసం సంఘటితం గా ముందుకు రావాల్సిన అవశ్యకత ఎంతో ఉందని , అందుకు కార్మికులు , కర్షకులు , విద్యార్థులు , మహిళలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు . ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బానోతు భద్రు నాయక్ , నకరికంటి సంజీవరావు తదితరులు పాల్గొన్నారు
🏠 Home