🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 November 2026, 8:15 pm Posted by : Telangana Vaartha

పెన్షన్ పెంచకుండా వికలాంగులను బైండొవర్ చేయించే హక్కు ముఖ్యమంత్రికి ఎక్కడిది

News Image
ఎన్.పి.ఆర్.డి జిల్లా ఉపాధ్యక్షులు వనం ఉపేందర్
రామన్నపేట 9 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్.పి.ఆర్.డి యాదాద్రి భువన జిల్లా ప్రధాన కార్యదర్శి వన ఉపేంద్ర మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ పర్యటన సందర్బంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక నాయకులు, కార్యకర్తలను సోమవారం రోజు ఉదయం నుండే బైండొవర్ చేయడాన్ని ఎన్ పి ఆర్ డిరాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది.తక్షణమే బైండొవర్ లను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తుంది.రాష్ట్ర ముఖ్యమంత్రి కొడంగల్ నియోజకవర్గంలో పర్యటన సందర్బంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఎన్ పి ఆర్ డి కార్యకర్తలు, నాయకులకు నోటీసులు ఇచ్చి బైండొవర్ చేయడం సరైనది కాదు.పెన్షన్ పెంచలేని ముఖ్యమంత్రికి వికలాంగులను బైండొవర్ చేయించే హక్కు ఎక్కడిది? ఏడో గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ అన్న ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే అరెస్ట్, బైండొవర్ లేనా? అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పినదానికి, నేడు అధికారంలోకి వచ్చి అమలు చేస్తున్నదానికి పొంతన లేదు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటి సారి వికలాంగులను బైండొవర్ చేయించిన ఘనత రేవంత్రెడ్డికి దక్కుతుంది. వికలాంగులను బైండొవర్ చేయించడం అంటే ముఖ్యమంత్రి అసమార్థతకు నిదర్శనం.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ఎన్ పి ఆర్ డి నాయకులు, కార్యకర్తలపై పెట్టిన బైండొవర్లను ఎత్తివేయాలని ఎన్ పి ఆర్ డి తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.పోరాట ఫలితమే కొత్త పెన్షన్స్ మంజూరు కొత్త పెన్షన్స్ మంజూరు కోసం గత 3 సంవత్సరాల నుండి ఎన్ పి ఆర్ డి చేసిన పోరాటాల ఫలితమే నవంబర్ 8 నాడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తూ నిర్ణయం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పెన్షన్స్ కోసం సుమారుగా 50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారు.దసరా సందర్బంగా కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తామంటే సుమారుగా 6 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే విరిలో 4 లక్షల మందికే మంజూరు చేస్తున్నామని కొడంగల్ సభలో ముఖ్యమంత్రి ప్రకటించారు. దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరికి పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేస్తుంది.అన్ని జిల్లాల్లో వెంటనే పెన్షన్స్ పంపిణి చేయాలని, కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తున్నామని ప్రకటించి లబ్ధిదారులకు పెన్షన్స్ మంజూరు చేయకుంటే ఉద్యమం తప్పదు.ఎన్ పి ఆర్ డి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు స్వరూపంగా ప్రకాష్ ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి జిల్లా కోశాధికారి కొత్త లలిత జిల్లా ఉపాధ్యక్షులు చిత్తలూరి శ్రీహరి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
🏠 Home