🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 09 November 2026, 4:33 pm Posted by : Telangana Vaartha

జగ్గయ్యపేట 10వ వార్డులో ఓట్ల గోల్‌మాల్‌పై కోర్టు గర్జన !

News Image
చనిపోయినవారి ఓట్లు.. ఆసుపత్రిలో ఉన్నవారి ఓట్లు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవారి ఓట్లు !
26 ఆధారాలతో కోర్టును ఆశ్రయించిన అభ్యర్థి.. ఎన్నికల అధికారుల పనితీరుపై తీవ్ర ప్రశ్నలు !
జగ్గయ్యపేట:- జగ్గయ్యపేట మున్సిపాలిటీ 10వ వార్డు ఎన్నికల వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తనకు జరిగిన అన్యాయంపై 26 ఆధారాలతో అభ్యర్థి ఈరోజు జగ్గయ్యపేట కోర్టును ఆశ్రయించి ఫిర్యాదు సమర్పించడం సంచలనంగా మారింది.
చనిపోయిన వ్యక్తుల పేర్లపై ఓట్లు.. ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారి పేర్లపై ఓట్లు.. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి పేర్లపై ఓట్లు.. ఇతర రాష్ట్రాల్లో ఉన్న లారీ డ్రైవర్లు జగ్గయ్యపేటకు రాకుండానే వారి పేర్లపై ఓట్లు !
ఇన్ని ఆరోపణలు బయటకు వస్తుంటే ఎన్నికల యంత్రాంగం ఏం చేస్తోంది ? ఓటరు పోలింగ్ కేంద్రానికి రాకుండానే ఓటు ఎలా పడింది ? అసలు ఎవరు వేశారు ? పోలింగ్ సిబ్బంది ఏం పరిశీలించారు ?
మరోవైపు పోలింగ్ రోజే ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 26 ఆధారాలతో కోర్టు తలుపు తట్టే పరిస్థితి రావడం ఎన్నికల నిర్వహణపై అధికారుల బాధ్యతను ప్రశ్నార్థకం చేస్తోంది.
అధికారుల నిర్లక్ష్యమా ? లేక అక్రమాలకు అండదండలా ?
ప్రజల ఓటును కాపాడాల్సిన అధికారులే అనుమానాలకు తావిచ్చే పరిస్థితి ఏర్పడితే ప్రజాస్వామ్యం ఎక్కడ మిగులుతుంది ? ఇది కేవలం ఓడిపోయిన అభ్యర్థి ఆరోపణగా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. 26 ఆధారాలు కోర్టు ముందుంచినట్లు చెబుతున్న నేపథ్యంలో ప్రతి ఓటును విచారించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. 10వ వార్డు ఓటర్ల జాబితా, పోలింగ్ రికార్డులు, మార్క్‌డ్ ఓటర్ల జాబితా, టెండర్డ్ ఓట్ల వివరాలు, సీసీటీవీ దృశ్యాలు, పోలింగ్ సిబ్బంది రికార్డులు అన్నీ బయటపెట్టాలి ! అక్రమాలు నిజమని తేలితే ఎన్నికను కాపాడటం కాదు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ముఖ్యం. చట్ట ప్రకారం రీపోలింగ్ లేదా తగిన ఎన్నికల న్యాయ ప్రక్రియ చేపట్టాలి.
ఓటు దొంగిలించబడిందనే ఆరోపణలపై అధికారులు మౌనం వీడాలి !
10వ వార్డు ప్రజల ఓటుకు విలువ ఉందా ? లేక ఓటర్ల జాబితాలో పేరుండటమే సరిపోతుందా ? 26 ఆధారాలతో కోర్టు మెట్లు ఎక్కిన ఈ ఫిర్యాదుపై ఇక ఫైళ్లలో దాచిపెట్టే విచారణ కాదు.. ప్రజల ముందే నిజాలు బయటపెట్టే విచారణ కావాలి !
🏠 Home