సూర్యాపేట:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా సూర్యాపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఆదేశాల మేరకు సూర్యాపేట పట్టణంలోని విద్యా నగర్ లోని వారి కార్యాలయంలో కౌన్సిలర్ ఎల్గూరి ఇందిరా వీరయ్య గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు... ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు, రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ, రేషన్ కార్డుల పంపిణీ, అర్హులైన వారందరికి పెన్షన్ల పంపిణీ అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అంతేకాకుండా రైతు భరోసాతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ పేద ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 3500 మందికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా దీపావళిపండుగ జరుపుకుంటున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు ధరావత్ లింగా నాయక్, అనంతుల యాదగిరి, సాజిద్ ఖాన్, ఎస్సీ సెల్ నాయకులు కొత్తపల్లి వెంకన్న, పిడమర్తి ఉపేందర్, పటాన్ నబి ఖాన్, NSUI రాష్ట్ర కార్యదర్శి బంధం విష్ణు, నజీర్, జావిద్, సోహెల్, రమాదేవి, నర్సింగ్ కిరణ్ నర్సింగ్ మహేష్, కరీం, సాత్విక్ రెడ్డి, గాలి వికాస్ తదితరులు పాల్గొన్నారు