ప్రభుత్వ సెలవు దినాలలో భూ - కబ్జాదారులు కంచ వేస్తున్నారు
పలుమార్లు వినతి పత్రలు ఇచ్చిన పట్టించుకొని రెవిన్యూ సిబ్బంది
వెంటనే ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 116 లో ఉన్న భూమిని కాపాడలి
టి ఎమ్మార్పీఎస్ జిల్లా నాయకులు గాజర్ల రాజు మాదిగ
ములుగు జిల్లా, 9 నవంబర్ 2026 :- మంగపేట మండలం కమలాపురం గ్రామంలో ప్రభుత్వ భూములను అన్యాక్రాంతంగా ఆక్రమించుకొని లక్షల రూపాయలకు ప్రభుత్వ ఆస్సైన్మెంట్ భూమిని కబ్జాదారులు అమ్ముకుంటున్న కానీ నిమ్మకు నీరెత్తినట్టు చూస్తున్న మండల తాసిల్దార్ కార్యాలయం యొక్క సిబ్బంది. కమలాపురం లోని సర్వే నెంబర్ 116 లో గల ప్రభుత్వ భూమి చాకలి కుంట దాని పరిధిలో గల విస్తీర్ణం లో ఉండబడిన భూమి మొత్తం ఉన్నత వర్గాలు ఆక్రమించుకొని అమ్ముకుంటున్నారు. నిరు పేదలైన పేద వర్గాల ప్రజలకు ఉండటానికి ఇంటి స్థలాలు లేక ఎన్నో అవస్థలు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలంటే ప్రభుత్వ భూములు లేవు అని ఉన్నత అధికారులు ప్రజలకు చెపుతున్నారు. ప్రభుత్వ భూములు కబ్జా జరుగుతుంటే ఈ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్ 116 లో ప్రభుత్వ భూమి ఉందని గత ఐదు సంవత్సరాల నుండి దళిత గిరిజన సంఘాలు 116 సర్వే నంబర్ లో ఉన్న భూమిని కాపాడాలని వినతి పత్రలు రెవిన్యూ సిబ్బందికి జిల్లా అధికారులకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవడం లేదు.మంగపేట తాసిల్దారు ఆర్ ఐ మరియు సర్వేర్ వీరి సమక్షంలో పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా సర్వే రేపు మాపు అని చేపి హద్దు లేస్తామని చెబుతూ వస్తున్నారు. కానీ ఆ భూమిని ఇప్పటివరకు సర్వే చేసిన చరిత్ర మంగపేట తాసిల్దార్ కి లేదు ఆర్ఐ కి కూడా లేదని గాజర్ల రాజు మాదిగ అన్నారు.కారణం వీరికి కూడా కబ్జాదారుల నుండి వాటా ఉందని ప్రజలకు అనుమానాలకు తవిస్తున్నారాని వారు అన్నారు. వెంటనే చాకలి కుంట విస్తీర్ణం లోని ప్రభుత్వ భూమిని సర్వే చేయించి ప్రభుత్వ సరిహద్దులు వేయాలని టి.ఎం.ఆర్.పి.ఎస్ జిల్లా నాయకులు గాజర్ల రాజు మాదిగ జిల్లా కలెక్టర్ ని కోరుచున్నారు. లేనియెడల పేద ప్రజల చేత ఆ భూమిలో ఇల్లు లేని నిరుపేదలను తీసుకొచ్చి ఇంటి స్థలాలు కేటాయించడం జరుగుతుందని టిఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు గాజర్ల రాజు మాదిగ జిల్లా కలెక్టర్ కి పత్రిక ముఖంగా వారు తెలిపినారు.