అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే నిజమైన దీపావళి...
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీ పరిధిలోని BGR హై స్కూల్ CBSE లో ముందస్తు దీపావళి వేడుకలు కరస్పాండెంట్ ఎస్.బాల వెంకట్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.... విద్యార్థులు "దీపం"ని వెలిగించి దీపావళి పండుగ ప్రాశస్త్యాన్ని తెలియజేశారు...
ఈ సందర్భంగా కరస్పాండెంట్ మాట్లాడుతూ.... విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ముందస్తు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.... కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని పిలుపునిచ్చారు.చీకటిపై వెలుగు విజయమే దీపావళి అని, విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సంప్రదాయాలను తెలుసుకోవాలని సూచించారు. పటాకులు కాల్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, కాలుష్య రహిత దీపావళి జరుపుకోవాలని కోరారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించడమే నిజమైన దీపావళి అని అన్నారు. దీపావళి పండుగను పర్యావరణానికి హాని కలిగించకుండా జరుపుకోవాలని కోరారు. గ్రీన్ క్రాకర్స్ సాధారణ టపాసుల కంటే తక్కువ కాలుష్యం కలిగించేవే అయినా, పూర్తిగా కాలుష్యరహితం కాదని గుర్తించాలి.చిన్న పిల్లలు పెద్దల పర్యవేక్షణలో మాత్రమే టపాసులు పేల్చాలని, కాటన్ దుస్తులు ధరించి సురక్షిత దూరంలో ఉండాలని సూచించారు. దీపాలను ఎక్కువగా వెలిగించి, టపాసుల వాడకాన్ని తగ్గించి శబ్ద, వాయు కాలుష్యాన్ని నియంత్రించాలని అభ్యర్థించారు....
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు, PET సూర్యచంద్ర,మరియు ఉపాధ్యాయులు విద్యార్థులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు....