జిల్లా స్థాయిలో మెరిసి రాష్ట్ర స్థాయికి ఎంపికైన గుమ్మడిదొడ్డి పాఠశాలవిద్యార
తెలంగాణ వార్త స్టాఫ్ రిపోర్టర్ అల్లి ప్రశాంత్ కుమార్:-
32వ జాతీయ బాలల విజ్ఞాన తొలి కాంగ్రెస్ (2026) ములుగు జిల్లా స్థాయి పోటీలలో వాజేడు మండల ఘనకీర్తిని చాటుతూ ఎంపీయూపీఎస్ గుమ్మడిదొడ్డి పాఠశాల విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచి ద్వితీయ బహుమతిని కైవసం చేసుకున్నారు. అంతేకాకుండా, జూనియర్ విభాగంలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై మన వాజేడు మండలానికి మరియు పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు. ఎం. హర్షవర్ధన్, ఎం. జీవన్ తేజ రూపుదిద్దిన వృథా నీటితో పచ్చని తోట పెంపకం (గ్రే వాటర్ టూ గ్రీన్ గార్డెన్) అనే వినూత్న సైన్స్ ప్రదర్శన న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుంది. పాఠశాల ప్రాంగణంలో నీటి వృథాను అరికట్టడం, వినియోగించిన నీటిని తిరిగి మొక్కలకు సమర్థవంతంగా మళ్లించడం, పర్యావరణ పరిరక్షణ, నీటి సంరక్షణ లక్ష్యంగా విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగం అందరి ప్రశంసలు అందుకుంది.
జవహర్‌నగర్‌లోని ఆదర్శ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో విద్యార్థులు ఈ విశేష ఘనత సాధించారు. మార్గదర్శక ఉపాధ్యాయులు డి. నాగార్జున నేతృత్వంలో విద్యార్థులు ప్రయోగాన్ని అత్యంత ఆకర్షణీయంగా రూపొందించి ప్రదర్శించారు. మండల కీర్తిని రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లిన విద్యార్థులను, ఉపాధ్యాయులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు గిరిప్రసాద్, స్థానిక మండల విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.