దీపావళి పండుగను ఆనందంగా సురక్షితంగా జరుపుకుందాం
జోగులాంబ గద్వాల 7 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. ఇటిక్యాల . మండలం
దీపావళి పండుగ ను చాగాపురం గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గ్రామ సర్పంచ్ సావిత్రమ్మ పరుశరాముడు. వారు మాట్లాడుతూ
దీపావళి అనేది దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకునే దీపాల పండుగ. అయితే, చిన్నపాటి నిర్లక్ష్యం, అజాగ్రత్త కారణంగా ఈ ఆనందకరమైన పండుగ ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. ముఖ్యంగా బాణసంచా పేల్చే సమయంలో అగ్నిప్రమాదాలు, కాలిన గాయాలు మరియు ఇతర ప్రమాదాలు సంభవించవచ్చు. తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చు. 2025 సంవత్సరానికి సంబంధించిన గతంలో పేర్కొన్న గణాంకాల ప్రకారం, సాధారణ రోజుల్లో 1,766 మంది అగ్నిప్రమాదాల కారణంగా గాయపడగా, ఒక్క దీపావళి రోజునే బాణసంచా ప్రమాదాల కారణంగా 1,699 మంది ప్రమాదాలకు గురయ్యారు. ఈ గణాంకాలు ప్రజల్లో అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చిన్నపిల్లలు మరియు వృద్ధుల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
బాణసంచా కాల్చేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు బాణసంచాను ఇళ్లలో కాకుండా విశాలమైన బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలి. ఇళ్లు, వాహనాలు మరియు మండే స్వభావం కలిగిన వస్తువులకు దూరంగా ఉండాలి. అధిక శబ్దం వచ్చే బాణసంచాను వీలైనంత వరకు నివారించాలి. ఇది శబ్ద కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు చిన్నపిల్లలు, వృద్ధులకు రక్షణ కల్పిస్తుంది. శరీరానికి సౌకర్యవంతంగా ఉండే కాటన్ దుస్తులు ధరించాలి. వదులుగా ఉండే లేదా సులభంగా మండే సింథటిక్ దుస్తులను ధరించకూడదు.
బాణసంచా కాల్చేటప్పుడు తప్పనిసరిగా పాదరక్షలు ధరించాలి.
చిన్నపిల్లలు పెద్దవారి పర్యవేక్షణలో మాత్రమే బాణసంచా కాల్చాలి.
అవసరమైన సందర్భాల్లో కళ్లకు రక్షణగా గాగుల్స్, మాస్క్ ధరించాలి.
చేతిలో బాణసంచా పట్టుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చకూడదు. నేలపై ఉంచి, తగినంత దూరం పాటిస్తూ కాల్చాలి.
అనుకోని అగ్నిప్రమాదాలను ఎదుర్కొనేందుకు దగ్గరలో ఒక బకెట్ నీరు లేదా ఇసుకను అందుబాటులో ఉంచుకోవాలి.
పేలని టపాసులను తిరిగి వెలిగించే ప్రయత్నం చేయకూడదు.
అగ్నిప్రమాదాలు మరియు కాలిన గాయాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన చర్యలు
ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర వైద్య సహాయం కోసం 108కు కాల్ చేయాలి.
కాలిన గాయాలపై ఐస్ ఉపయోగించకుండా, శుభ్రమైన సాధారణ చల్లటి ప్రవహించే నీటితో 20 నిమిషాల పాటు చల్లబరచాలి.
గాయపడిన ప్రాంతాన్ని శుభ్రమైన, మెత్తటి వస్త్రంతో లేదా స్టెరైల్ డ్రెస్సింగ్‌తో వదులుగా కప్పాలి.
కాలిన గాయాలపై కొబ్బరి నూనె, ఇంకు, టూత్‌పేస్ట్ లేదా ఇతర గృహ సంబంధిత పదార్థాలను పూయకూడదు.
కాలిన గాయాలపై ఏర్పడిన బొబ్బలను పగలగొట్టకూడదు. చర్మానికి అంటుకున్న దుస్తులను బలవంతంగా తొలగించకూడదు.
వైద్యుల సూచన మేరకు మాత్రమే ఆయింట్మెంట్లు ఉపయోగించాలి. తప్పనిసరిగా వైద్య చికిత్స పొందాలి.
మన చిన్నపాటి జాగ్రత్త... మరొకరి ప్రాణాన్ని కాపాడవచ్చు. బాధ్యతాయుతంగా, సురక్షితంగా దీపావళి జరుపుకుందాం. అని గ్రామ ప్రజలను కోరారు.