ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన
20 ఏళ్ల రాజకీయ అనుబంధం… మరచిపోలేని ఆత్మీయ స్నేహం..
రాజకీయ ప్రస్థానంలో జడ్పీటీసీగా ఉన్న రోజుల నుంచి మీతో ఏర్పడిన పరిచయం నేటికీ ఎంతో ఆత్మీయంగా కొనసాగడం నాకు ఎంతో సంతోషాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది.
ఒక సాధారణ ప్రజాప్రతినిధిగా ప్రారంభమైన మీ రాజకీయ ప్రయాణం… ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, ప్రజల ఆదరాభిమానాలతో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం మీ పట్టుదలకు, రాజకీయ పోరాట పటిమకు నిదర్శనం.
రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి… పోతుంటాయి. అధికారం మారుతుంటుంది… కానీ మనుషుల మధ్య ఉన్న నిజమైన స్నేహం, నమ్మకం, అనుబంధం ఎప్పటికీ మారకూడదు.
నాడు జడ్పీటీసీగా ఉన్న పరిచయం నుంచి నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎదిగిన మీ ప్రస్థానం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది.
మీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, ప్రజల ఆశయాలను నెరవేరుస్తూ రాజకీయాల్లో మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
ముందుగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. 💐
మీ రాజకీయ ప్రస్థానం మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ…
ఇట్లు,
వడ్డేపల్లి శ్రీనన్న సైన్యం అలంపూర్ నియోజకవర్గం..