🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 November 2026, 7:55 pm Posted by : Alli prashanth kumar

*ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం*

News Image
*ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయడం హర్షణీయం*

*-ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవి ఆదివాసులకే కేటాయించాలి..*
*– ఆదివాసీ నవనిర్మాణ సేన మండల కార్యదర్శి తల్లడి ప్రసాద్*

వాజేడు తెలంగాణ వార్త:-
ములుగు స్టాఫ్ రిపోర్టర్ అల్లి ప్రశాంత్ కుమార్

తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం హర్షణీయమని, తెలంగాణలోని ఆదివాసీ ప్రజల హక్కుల పరిరక్షణకు, సామాజిక న్యాయ సాధనకు ఒక కీలక ముందడుగు కావాలని ఆదివాసీ నవనిర్మాణ సేన మండల కార్యదర్శి తల్లడి ప్రసాద్ పేర్కొన్నారు.
భారత రాజ్యాంగం ఆదివాసీ గిరిజన సమాజానికి కల్పించిన హక్కులు, రక్షణలు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలయ్యేలా ఎస్టీ కమిషన్ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న భూమి సమస్యలు, విద్యా, ఉద్యోగ, వైద్య రంగాల్లో వెనుకబాటుతనం, అటవీ హక్కులు, పోడు భూముల సమస్యలు, రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘన వంటి అంశాలపై కమిషన్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా ఆదివాసీ తెగకు చెందిన వారికి అవకాశం కల్పించినట్లయితే
ఆదివాసీ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, వారి జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు, భౌగోళిక పరిస్థితులు, రాజ్యాంగపరమైన హక్కులపై సంపూర్ణ అవగాహన కలిగిన వ్యక్తి మాత్రమే ఆ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించగలరని అభిప్రాయపడ్డారు.
కాబట్టి ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిని ఆదివాసీ తెగలకు చెందిన అర్హత, సామర్థ్యం, సామాజిక నిబద్ధత కలిగిన వ్యక్తికే కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివాసీల కోసం ఏర్పాటుచేసే కమిషన్‌లో ఆదివాసీలకే ప్రాతినిధ్యం, నాయకత్వ అవకాశం కల్పించడం ద్వారా మాత్రమే నిజమైన సామాజిక న్యాయం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కమిషన్‌కు ఉండాల్సిన ప్రధాన బాధ్యతలు
ఆదివాసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల పరిరక్షణకు కృషి చేయాలన్నారు.
ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో రాజ్యాంగ నిబంధనలు, చట్టాల అమలును పర్యవేక్షించాలన్నారు.
పెసా చట్టం , 1/70 భూ బదలాయింపు నియంత్రణ చట్టం అమలుపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు.
ఆదివాసీల భూములు అన్యాక్రాంతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలనీ పేర్కొన్నారు.
ఆదివాసీ విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వానికి సూచనలు చేయాలనీ కోరారు.
ఆదివాసీలపై జరుగుతున్న దాడులు, వివక్ష, దోపిడీ, అన్యాయాలపై విచారణ జరిపించాలనీ తెలిపారు. అటవీ హక్కుల చట్టం అమలు, ఆదివాసీ సంస్కృతి, భాష, సంప్రదాయాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రభుత్వ శాఖల్లో ఆదివాసీలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు సక్రమంగా అందుతున్నాయా లేదా పర్యవేక్షించాలనీ .
ఆదివాసుల ఆకాంక్షలకు అనుగుణంగా కమిషన్ పనిచేయాలి ఎస్టీ కమిషన్ కేవలం ఒక పరిపాలనా వ్యవస్థగా కాకుండా ఆదివాసీ ప్రజల గొంతుకగా, వారి హక్కులకు రక్షణ కవచంగా నిలవాలని డాక్టర్ పాపారావు ఆకాంక్షించారు. కమిషన్‌లో ఆదివాసీ మేధావులు, విద్యావేత్తలు, న్యాయ నిపుణులు, సామాజిక ఉద్యమకారులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు.
ఆదివాసుల కోసం ఏర్పడే కమిషన్‌కు ఆదివాసీలే నాయకత్వం వహించాలి. ఆదివాసుల సమస్యలను అర్థం చేసుకునే వారికే బాధ్యతలు అప్పగించాలి. అప్పుడే ఎస్టీ కమిషన్ ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుంది.
ఎస్టీ కమిషన్ ఏర్పాటును స్వాగతిస్తున్నామని, అదే సమయంలో చైర్మన్ పదవిని ఆదివాసీ వ్యక్తికే కేటాయించి ఆదివాసీ సమాజానికి తగిన గౌరవం, ప్రాతినిధ్యం కల్పించాలని కమిషన్ ను కోరారు
🏠 Home