🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 07 November 2026, 10:57 am Posted by : Telangana Vaartha

సూర్యాపేట జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు..

News Image
కుటుంబ సభ్యులతో కలిసి ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలి
బాణాసంచాతో ప్రమాదం.. ద్వీపాల వెలుగులో పండుగ జరుపుకోవాలి – జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్
సూర్యాపేట, 7 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- దీపావళి పండుగ సందర్భంగా సూర్యాపేట జిల్లా ప్రజలందరికీ జిల్లా పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పర్వదినం ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దీపావళి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్పీ కోరారు. పండుగ వేళ ఇతరులకు ఇబ్బంది కలగకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
బాణాసంచా ప్రమాదం.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి:
బాణాసంచా కాల్చే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచించారు, ఇది ప్రమాదం, ద్వీపాల వెలుగుతో పండుగ జరుపుకోవాలి. ముఖ్యంగా పెద్ద శబ్దాలు వచ్చే బాంబులు, ప్రమాదకరమైన బాణాసంచా వినియోగానికి దూరంగా ఉండాలని తెలిపారు. బాణాసంచా కాల్చేటప్పుడు తగినంత దూరం పాటించాలని, నీటి బకెట్ లేదా ఇసుక అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. చిన్నపిల్లలను ఒంటరిగా బాణాసంచా కాల్చడానికి అనుమతించకుండా పెద్దల పర్యవేక్షణలోనే కాల్చించాలని కోరారు. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్య సమస్యలు ఉన్నవారిని బాణాసంచా కాల్చే ప్రదేశాలకు దూరంగా ఉంచాలని తెలిపారు. నివాస ప్రాంతాలు, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రదేశాలు, వాహనాల సమీపంలో బాణాసంచా కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కాల్చిన బాణాసంచా అవశేషాలను నిర్లక్ష్యంగా వదిలేయకుండా ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు.
అనుమతులు లేకుండా బాణాసంచా దుకాణాలు నిర్వహించరాదు:.
బాణాసంచా విక్రయించే వ్యాపారులు సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని, అనుమతులు లేకుండా ఎక్కడపడితే అక్కడ బాణాసంచా దుకాణాలు ఏర్పాటు చేయరాదని ఎస్పీ స్పష్టం చేశారు. దుకాణాల్లో అగ్నిప్రమాద నివారణ చర్యలు పాటించాలని, నిబంధనలకు అనుగుణంగా మాత్రమే విక్రయాలు నిర్వహించాలని సూచించారు.
పండుగను ఆనందంగా జరుపుకోవడమే కాకుండా మన కుటుంబ సభ్యుల భద్రతతో పాటు చుట్టుపక్కల వారి క్షేమాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని ఎస్పీ కోరారు. చిన్నపాటి నిర్లక్ష్యం పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తెలిపారు.
ప్రజల భద్రతే పోలీసుల ప్రథమ కర్తవ్యం. ప్రజలందరి సహకారంతో దీపావళి పండుగను సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆకాంక్షించారు.
🏠 Home