ఫోన్ పే మోసగాడి అరెస్ట్
ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి మీకు ఫోన్ చేసి నేను మీ షాపు ఎదురుగా ఉన్నటువంటి షాపు యొక్క యజమానినీ లేదా షాప్ లో పని చేసే వర్కర్ ని మీ యొక్క బంధువునని మాయ మాటలు చెప్పి, నాకు ఆరోగ్యం బాగాలేదు నేను ఆసుపత్రిలో ఉన్నాను నాకు అత్యవసరంగా డబ్బులు అవసరం ఉన్నది నేను రాగానే మీకు నగదు రూపంలో ఇస్తాను నాకు ఫోన్ పే చేయండి అని చెప్పి డబ్బులు కొట్టించుకొని మోసం చేస్తున్న మోసగాడిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించామని ఎస్సై వెంకట్ రెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు కూడా ఇటువంటి మోసాలకు గురి కావొద్దు. తిరుమలగిరి పట్టణంలో దివ్య ఐరన్ అండ్ హార్డ్వేర్ షాపు యజమానికి ఫోన్ చేసి నేను మీ షాపు ఎదురుగా ఉన్నటువంటి మాతాజీ ఎలక్ట్రికల్స్ షాప్ యొక్క యజమాని అని మాయ మాటలు చెప్పి అతనిని నమ్మించి అతని వద్ద నుండి ఫోన్ పే స్కానర్ ద్వారా 30 వేల రూపాయలు కొట్టించుకోని మోసం చేయడం జరిగినది. అదే రోజు శ్రీ రామాంజనేయ బోర్వెల్స యజమానికి ఫోన్ చేసి నేను మీకు తెలిసినటువంటి అభి వెల్డింగ్ వర్క్స్ ఓనర్ అభి ని మాట్లాడుతున్నాను అని చెప్పి ప్రస్తుతం నేను ఆరోగ్యం బాగోలేక ఆసుపత్రిలో ఉన్నాను అని మాయమాటలు చెప్పి నమ్మించి అతని వద్ద నుండి 15వేల రూపాయలు ఫోన్ పే స్కానర్ ద్వారా కొట్టించుకోవడం జరిగినది. ఇటువంటి నేరాలు చేసే వ్యక్తి అయిన కేతావత్ రాజేష్ నాయక్: కారు డ్రైవర్, .బంజారా కాలనీ, హయత్ నగర్, హైదరాబాద్, అనే వ్యక్తి నీ తిరుమలగిరి పోలీసు వారు నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లో పట్టుబడి చేసి తుంగతుర్తి కోర్టులో హాజరుపర్చగా సూర్యాపేట జైలుకు తరలించామని తెలిపారు, ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు