🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 November 2026, 10:47 pm Posted by : Telangana Vaartha

యువతను మాదకద్రవ్యాల బారి నుంచి కాపాడాలి

News Image
డ్రగ్స్‌పై నిరంతర అవగాహనతోనే బంగారు భవిష్యత్తు –
కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలర్ , మోటివేషనల్ స్పీకర్ : రావిరాల బుచ్చయ్య
ఖమ్మం :- యువత మాదకద్రవ్యాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని టీచర్, మోటివేషనల్ స్పీకర్, ఈగల్ ఫోర్స్ తెలంగాణ యాంటీ డ్రగ్స్ సోల్జర్ రావిరాల బుచ్చయ్య పిలుపునిచ్చారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విద్యార్థులకు సులభంగా అందుబాటులోకి రావడం ఆందోళనకరమని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల ఆరోగ్యం, చదువు, కుటుంబ జీవితం దెబ్బతినడంతో పాటు యువత నేరప్రవృత్తి వైపు మళ్లే ప్రమాదం ఉందన్నారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు, కౌన్సెలింగ్ నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వాలు మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు డీ-అడిక్షన్ కేంద్రాలను విస్తరించాలని కోరారు. డ్రగ్స్‌కు అలవాటుపడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులు, యువత ఈగల్ ఫోర్స్ తెలంగాణను లేదా సమీప వాలంటీర్లను సంప్రదించాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి భావి భారత పౌరులని, యువతను రక్షించుకోవడం సమాజ బాధ్యతని బుచ్చయ్య పేర్కొన్నారు.
🏠 Home