గుండెపోటుతో శివనంపల్లి సర్పంచ్ గుడిసెలక్ష్మన్న ఆకస్మిక మృతి.
జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఇటిక్యాల మండలం పరిధిలోని శివనంపల్లి గ్రామ సర్పంచ్ గుడిసెలక్ష్మన్న వయసు (44) సంవత్సరాలు. గుండెపోటుతో శుక్రవారం నాడు పరమపదించినారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వ్యక్తి ఒకసారిగా గుండె పోటుకు గురై ప్రాణాలు విడవడంతో శివనంపల్లె గ్రామంలో తీవ్ర విషాదఛాయలు నెలకొన్నాయి. గత ఏడాది డిసెంబర్లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో ఏ పార్టీ నుండి పోటీ చేయకుండా స్వతంత్ర అభ్యర్థిగా గ్రామ సర్పంచ్గా గెలుపొందారు. గ్రామ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లిన ఆయనపై నమ్మకంతో ఊరి ప్రజలందరూ ఏకమై అత్యధిక మెజారిటీతో సర్పంచుగా గెలిపించుకున్నారు. సర్పంచ్ గా గెలుపొందిన సంవత్సరం కాకముందే గ్రామ అభివృద్ధికి ఎన్నో సేవలు అందించాల్సి నా తరుణంలో ఆయన అకస్మాత్తుగా కన్నుమూయడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది ఈయనకు భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మంచి నాయకుడిని కోల్పోయి నామని గ్రామ ప్రజలు అభిమానులు కన్నీరు మున్నీరు అయ్యారు. లక్ష్మన్న ఆకస్మిక వృత్తిపట్ల గ్రామస్తులు రాజకీయ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.