సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం మనందరి బాధ్యత
మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి
పట్టభద్రుల వాయిస్ గా నేను ఉంటా
దామన్న బిడ్డను గెలిపిస్తారని కోరుకుంటున్న
సూర్యాపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక రైల్వే లైన్
సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలంటే రైల్వే లైన్ కావాలి
సూర్యాపేట నియోజకవర్గ ప్రజల పక్షాన కోరుతున్న
60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కనెక్టింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలి
నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి
సూర్యాపేట పట్టణంలోని రవి మహల్ కన్వెన్షన్ హాల్లో సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది. జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పలువురు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి సభ్యులు కేతావత్ శంకర్ నాయక్, నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామెల్, రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, తెలంగాణ వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు, మాజీ డీసీసీ అధ్యక్షులు చెవిటి వెంకన్న యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, పిసిసి ప్రధాన కార్యదర్శి చకిలం రాజేశ్వరరావు, ఎస్సి కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రీతమ్, మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
“సర్వోత్తమ్ రెడ్డిని గెలిపించే బాధ్యత మనందరిపై ఉంది. మన పార్టీకి చెందిన, మన కుటుంబాలకు చెందిన ప్రతి అర్హతగల పట్టభద్రుడిని ఓటరుగా నమోదు చేయించాలి. సూర్యాపేట జిల్లా నుంచి అత్యధిక మెజారిటీ రావాలి” అని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావడం నిస్సందేహమని పేర్కొంటూ, 1994 నుంచి 2004 వరకు తెలుగుదేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నాయని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి దీర్ఘకాల భవిష్యత్తు ఉందని, ప్రజల ఆశీర్వాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్లపాటు కొనసాగుతుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
“మనందరి ప్రియతమ నాయకుడు దామన్న కుమారుడు సర్వోత్తమ్. కాంగ్రెస్ రక్తం, కాంగ్రెస్ కుటుంబం నుంచి వచ్చిన సర్వోత్తమ్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి” అని ఆయన అన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్క పిలుపుతో ఇంత పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు.
“మీ అందరూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలి. ఈ ఎన్నికను మీ ఎన్నికగా భావించి పనిచేయాలి. పట్టభద్రుల సమస్యలపై శాసనమండలిలో మీ వాయిస్‌గా నేను నిలుస్తాను” అని హామీ ఇచ్చారు.
196 మండలాల్లో తిరిగి ప్రతి పట్టభద్రుడిని కలిసే ఓపిక, శక్తి ఈ సర్వోత్తముడికి ఉందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సూర్యాపేట నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన రైల్వే లైన్ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావిస్తూ, సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చెందాలంటే రైల్వే లైన్ అత్యవసరమని అన్నారు.
అలాగే 60 ఫీట్ల రోడ్డు నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కనెక్టింగ్ రోడ్డు ఏర్పాటు చేయాలని సూర్యాపేట నియోజకవర్గ ప్రజల పక్షాన కోరారు.
చివరగా, “మీ దామన్న బిడ్డను, మీ సర్వోత్తముడిని భారీ మెజారిటీతో గెలిపించాలని” పట్టభద్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ, గ్రామ స్థాయి నాయకులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.