🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 November 2026, 10:31 pm Posted by : Telangana Vaartha

ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన

News Image
రూ.190 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలించిన
రాష్ట్ర పౌరసరఫరాల మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి
జిల్లాలో విద్య, వైద్య మౌలిక సదుపాయాలు పెంపొందించుటకు కృషి చేస్తానని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం అయన సూర్యాపేటలో రూ.190 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను పరిశీలన, రూ.1.17 కోట్ల అంచనా వ్యయంతో ఎస్బిఐ, ఐఓసీ, కోటక్ మహీంద్రా, అక్షర ఫౌండేషన్ వారి సౌజన్యంతో కొనుగోలు చేసిన ఆధునిక వైద్య పరికరాలైన డీజన్ లైట్ వెంటిలేటర్లు, మైక్రోటోన్, కటరీ మెషిన్, బ్రోంకోస్కోప్, డెంటల్ చైర్, సీ-ఆర్మ్ తదితర పరికరాల ప్రారంభోత్సవం మరియు కాంపెన్సేటరీ అపాయింట్‌మెంట్ ప్రక్రియలో భాగంగా నియామక పత్రాలను పంపిణీ చేశారు. తదుపరి ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో 190 కోట్ల రూపాయల వ్యయంతో 5 అంతస్తుల 1000 పడకల ఆసుపత్రి భవన నిర్మాణంను నాణ్యతతో వేగంగా రెండు, మూడు నెలలలో పూర్తిచేసి ప్రారంభించడానికి సిద్ధం చేయాలని అన్నారు. జిల్లాలో వైద్యం, విద్య మౌలిక సదుపాయాల పెంపొందించుటకు ప్రయత్నం చేస్తానని, హైదరాబాద్ విజయవాడ 4 లైన్ల నేషనల్ హైవే ను 6 లైన్ ల రోడ్ గా మంజూరు చేయించి త్వరలో పనులు ప్రారంభించడం జరుగుతుందని, దేవాదుల 6 వ ప్యాకేజీ కింద తుంగతుర్తి నియోజకవర్గానికి 1000 కోట్లను మంజూరు చేయించి నీటిని తీసుకొస్తానని, పాత లిఫ్టుల పునర్దన మరియు కొత్త లిఫ్టుల పునరుద్ధరణకు కృషి చేస్తానని, సూర్యాపేట జిల్లాలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డు ఇప్పించడం జరిగిందని అలాగే 80 శాతం మంది ప్రజలకు సన్న బియ్యం కూడా ఇస్తున్నామని అన్నారు. రాబోవు రోజుల్లో సూర్యాపేట జిల్లాను అన్ని రంగాలలో ముందు వరుసలో ఉంచుతానని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో నల్లగొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, ఎస్పీ నరసింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ వేనారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ మొర్రిశెట్టి నివేదిత, జిజిహెచ్ సూపర్డెంట్ శ్రవణ్, మాజీ పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, వైద్య సిబ్బంది అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
🏠 Home