🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 November 2026, 7:59 pm Posted by : Telangana Vaartha

పుటాన్ దొడ్డి పీఏసీఎస్ నూతన చైర్మన్ బోయ మధు నాయుడుకు సంధ్య బాబు ఘన సన్మానం

News Image
జోగులాంబ గద్వాల 6 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ఎర్రవల్లి. మండల కేంద్రంలోని పుటాన్ దొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పీ.ఏ.సీ.ఎస్. నూతన చైర్మన్‌గా నియమితులైన బోయ మధు నాయుడును ఈరోజు ఎర్రవల్లి మండల పరిధిలో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ సంధ్య బాబు నూతన చైర్మన్ బోయ మధు నాయుడును పూలమాల శాలువా పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం సంధ్య బాబు మాట్లాడుతూ

నూతనంగా చైర్మన్ బాధ్యతలు చేపట్టిన బోయ మధు నాయుడు కి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మన ప్రియతమ నాయకులు అలంపూర్ మాజీ శాసనసభ్యులు ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాలని రైతుల సంక్షేమం అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ రంగ అభివృద్ధికి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పీఏసీఎస్ ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, నక్కలపల్లి సర్పంచ్ రాజు కొండేరు వెంకటేష్ యక్తాపురం ఆదాము దువాస్ పల్లి హుస్సేన్ వేముల తిమ్మరాజు తదితరులు పాల్గొని నూతన చైర్మన్ బోయ మధు నాయుడుకు శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home