🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 November 2026, 7:58 pm Posted by : Telangana Vaartha

సమావేశం ఫ్లెక్సీలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఫోటో గల్లంతు

News Image
కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారిన వైనం

పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల సన్నాహక సమావేశానికి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. స్వర్గీయ రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి ముఖ్య అనుచరుడిగా, సుమారు నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడిగా కొప్పుల వేణారెడ్డికి జిల్లా కేంద్రంలో, ప్రజల్లో, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి నాయకుడి ఫోటో సమావేశ ఫ్లెక్సీలో లేకపోవడంపై సమావేశానికి హాజరైన కార్యకర్తలు, అభిమానులు, ముఖ్య నాయకులు ఒకింత అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సమావేశం ప్రారంభంలోనే ఈ అంశం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. నిర్వాహకుల పొరపాటా.. లేక కావాలనే ఫోటో పెట్టలేదా అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.
🏠 Home