🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 06 November 2026, 5:46 pm Posted by : Kadem Ravi

అగ్నికి ఆహుతి అయిన గడ్డివాం

News Image
అడ్డగూడూరు 6 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని లక్ష్మిదేవికాల్వ గ్రామంలో త్రీ ఫేస్ కరెంటు ఒక దానికి ఒకటి ఆనుకోని నిప్పు రవ్వలు గడ్డి వాము మీద పడడంతో చెరుకు ఎల్లయ్య గడ్డివాము దాదాపు 400 కట్టలు కట్టిన గడ్డి తగలబడడంతో దాదాపు 1లక్షా రూపాయలు నష్టం వాటిల్లిందని రైతు ఎల్లయ్య ఆవేధన వ్యక్తం చేసారు, సకాలంలో పోలిస్ అధికారులు ఫైరింగ్ అగ్నిమాపక అధికారులు ఫోన్ చేయగా స్పందించి అగ్నిమాపక సిబ్బంది మంటలు గాలికి ఎగిసిపడకుండా ఫైరింజ న్ తో అధికారులు మంటలు ఆర్పినారు.అక్కడ చేరుకున్న రైతులు మాట్లాడుతూ..అసలే ఏలినో ప్రాబ్లంతో వరి ధాన్యం పంటలు పండక రైతులు సతమతమవుతుంటే, మనుషులకు తిండి కరువాయే.. మూగ జీవాలకు మేత కరువయ్యే పరిస్థితి నెలకొంటుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు స్పందించి లూజ్ కలెక్షన్ లేకుండా సరిచేయాలని గ్రామస్తులు,రైతులు కోరుతున్నారు.
🏠 Home