ఖమ్మం:- నగరంలోని నారాయణ పాఠశాల విద్యార్థులు క్రీడారంగంలో తమ ప్రతిభను చాటుకున్నారు . నవంబర్ 1, 2026న ఖమ్మంలోని వర్తక సంఘ భవనంలో" సుమన్ షోటోకాన్ స్పోర్ట్స్ కరాటే-డో అకాడమీ ఇండియా "ఆధ్వర్యంలో నిర్వహించిన 32వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ – 2026 పోటీల్లో నారాయణ పాఠశాల విద్యార్థులు పాల్గొని గోల్డ్ మెడల్స్ సాధించినవారు అక్షర గోకుల , జైత్ర యాదవ్ , రుషిత విశాంత్, దేవాన్ష్, కార్తీక్ నందన్ సిల్వర్ మెడల్స్ సాధించినవారు కార్తికేయ, భరత్ చంద్ర, సత్య సందేశ్, కీయాన్స్, సోనాక్షిక ప్రియ, భవిష్, సాక్షిత బ్రాంజ్ మెడల్స్ సాధించిన వారు పూజ, దివిజ ఉన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించేలా నారాయణ విద్యాసంస్థలు ప్రోత్సహిస్తున్నాయని పాఠశాల ప్రిన్సిపాల్ జి. నవీన్ కుమార్ తెలిపారు. క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, పట్టుదల మరియు నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను మరియు కరాటే కోచ్ ఉపేందర్ ను ప్రిన్సిపాల్ అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.