ఖమ్మం:- హోల్సేల్ ఫ్రూట్స్ మర్చంట్ వెల్ఫేర్ యూనియన్ ఖమ్మం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు . ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా షేక్ జానీ మియా , గౌరవ అధ్యక్షులుగా ఏ. మల్లికార్జున్ రావు , ఉపాధ్యక్షులుగా షేక్ అబ్దుల్ నబీ, ప్రధాన కార్యదర్శిగా గరగ శ్రీనివాస్ , సహాయ కార్యదర్శిగా ఎన్. వెంకటేశ్వర్లు , కోశాధికారిగా ఎండీ ఉస్మాన్ అలీ, గౌరవ సలహాదారుగా ఏ. శ్రీనివాసరావు , కమిటీ సభ్యులుగా షేక్ కరీం , షేక్ ఖాసిం లు ఎన్నికయ్యారు . ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఖానాపురంలో ఫ్రూట్ మార్కెట్ ఏర్పాటుకు మూడు ఎకరాల 10 గుంటల స్థలం కేటాయించి , మార్కెట్ నిర్మాణానికి రూ.18.72 కోట్లు మంజూరు చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మార్కెట్ నిర్మాణం పూర్తయితే సుమారు 10 వేల మందికి జీవనోపాధి లభిస్తుందని పేర్కొన్నారు. ఫ్రూట్ మార్కెట్కు త్వరితగతిన శంకుస్థాపన చేసి, నిర్మాణ పనులు ప్రారంభించాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావును నూతన కమిటీ సభ్యులు కోరారు.