అడ్డగూడూరు 5 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మంగమ్మగూడెం, గోవిందపురం మీదుగా కాలువను నివాస గృహాల మధ్యలో నుండి తీసుకుపోతున్నారు. అక్కడి నుండి తీసుకుపోకుండా దానికి దూరంగా ప్రక్కకు తిప్పి కాలువను సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల వెనకాల నుండి నక్కల వాగు మొదలవుతుంది.. మంగమ్మ గూడెం ఇళ్లను వదిలివేసి పక్కనుండి కాలువ తీస్తే బడి వెనకాల నుండి ఎలాంటి ఆటంకం లేకుండా ఎవరికీ నష్టం లేకుండా కాలువ తీస్తే రైతులు తక్కువగా నష్టపోతారు.ఈ బునాదిగాని కాలువ నక్కల వాగు ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడి నుండి కాలువను అను సంధానం చేయవలసిందిగా కోరుచున్నాము మూసీ నీళ్లు మాకు వద్దు..8మాకు గోదావరి నీళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోండి అలాగే చట్ట పరంగా,రైతులు ఉన్నపుడు సర్వే చేసి ఎవరి భూమి ఎంత పోతున్నదో కొలతలు చూసి సర్వే చేయాలని అందరం కోరుతున్నాం.ఎవరి భూమి ఎవరి పేరు మీద ఉన్నదో తెలువకుండా సర్వే నిర్వహించారు.ఎవరూ లేనప్పుడు వచ్చి ఎవరో ఒకరిని పట్టుకొని ఎవరి భూమి ఏదో తెలవకుండా సర్వే చేసారు కావున రైతులు ఉన్నప్పుడే వారి భూమి హద్దులు చూపించిన తర్వాతనే వారు సర్వే చేసి నా భూమి ఇంత వరకు ఉంటది అని రైతు నిర్ణయించిన తర్వాతనే రేటు కూడా నిర్ణయించాలీ,అక్కడ మార్కెట్ రేటు ప్రకారం ఎంత ఉంటుందో ఆ రేటులో సగమైన మాకు వచ్చే విధంగా చూడాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.