పుటాన్ దొడ్డి పీఏసీఎస్ నూతన చైర్మన్, వైస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం...!
రైతుల సంక్షేమమే సహకార సంఘాల ప్రధాన లక్ష్యం
డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్.
జోగులాంబ గద్వాల5 నవంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండలంలోని పుటాన్ దొడ్డి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) నూతన చైర్మన్గా బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్గా శ్యాంసుందర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలంపూర్ మాజీ శాసనసభ్యులు, ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్.ఏ.సంపత్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ మాట్లాడుతూ...! సహకార సంఘాలు రైతులకు మరింత చేరువగా ఉంటూ, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, ప్రభుత్వ సహకారంతో వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడాలని నూతన చైర్మన్ బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్ శ్యాంసుందర్ రావులకు సూచించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్తో పాటు పాలకవర్గ సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ రైతుల సంక్షేమం, అభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ పచ్చర్ల కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నీలి శ్రీను, ఎర్రవల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి, మాజీ అధ్యక్షులు వెంకటేష్ యాదవ్, గద్వాల మున్సిపల్ వైస్ చైర్మన్ గండిపేట శంకర్, జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షులు ఎనుముల నాగరాజు, భాస్కర్ రెడ్డి, ఇటిక్యాల.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యు అంజనేయులు.నల్లారెడ్డి, మద్దిలేటి, జోగుల రవి, సిరాజ్, జాన్, ఆదాము, వెంకటేష్, ఉమాపతి నాయుడు వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.