🏠 www.telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 05 November 2026, 2:59 am Posted by : Telangana Vaartha

కోదాడలో ఉచిత శిక్షణలో ఉన్న పోలీసు ఉద్యోగ ఆశవాహ యువతకు స్టడీ మెటీరియల్ పంపిణీ చేసిన

News Image
ముఖ్యమైన పాయింట్స్:జిల్లా కలక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పి కె.నరసింహ.
- ఒత్తిడికి గురికాకుండా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
- లక్ష్యం, గమ్యం స్పష్టంగా ఉండాలి.
- ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలి.:
-...జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.
- కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలి.
- నిరంతర కృషితో సాధన చేస్తే అన్ని సాధ్యమే.
....జిల్లా ఎస్పీ నరసింహ
11 పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్ పంపిణీ
కోదాడ:- ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు జిల్లా యంత్రాంగం, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత ముందస్తు శిక్షణను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు సాధించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ కె. నరసింహ సూచించారు. జిల్లా వ్యాప్తంగా పోలీసు ఉద్యోగాల ఆశావహ యువతకు ఉచిత శిక్షణ అందించడంలో భాగంగా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాలకు చెందిన 200 మంది అభ్యర్థులకు కోదాడ పట్టణంలోని కేఆర్‌ఆర్ కళాశాల ప్రాంగణంలో శిక్షణ నిర్వహిస్తున్నారు. ఈ శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు ఈరోజు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ అధికారుల సమక్షంలో 11 పుస్తకాలతో కూడిన స్టడీ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ మాట్లాడుతూ.. జీవితంలో లక్ష్యం స్పష్టంగా ఉండాలని, గమ్యాన్ని చేరుకునేందుకు మంచి ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు. ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా అధిగమించాలని, పరీక్షల విషయంలో ఒత్తిడికి గురికావద్దని అన్నారు. చదవాల్సిన సబ్జెక్ట్ ఎంత ఉంది, పరీక్షకు అందుబాటులో ఉన్న సమయం ఎంత ఉందో ముందుగానే అంచనా వేసుకుని సమయాన్ని వృథా చేయకుండా చదువుకోవాలన్నారు. గత ప్రశ్నాపత్రాలను పరిశీలించి ప్రశ్నల సరళిపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. పరీక్ష సమయానికి సబ్జెక్టుపై కనీసం మూడుసార్లు రివిజన్ చేసుకునేలా ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ నరసింహ ఐపీఎస్ రూపొందించిన ప్రణాళికతో, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలు, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి, సూర్యాపేట, తుంగతుర్తి ఎమ్మెల్యేల సహకారంతో జిల్లా వ్యాప్తంగా 400 మంది పోలీసు ఉద్యోగాల ఆశావహ యువతకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. నైపుణ్యం కలిగిన అధ్యాపక బృందం, ఫిజికల్ ఈవెంట్స్‌లో అనుభవం ఉన్న పోలీసు సిబ్బందితో పాటు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పిస్తూ శిక్షణను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. అభ్యర్థులకు మంచి సబ్జెక్టుతో కూడిన 11 పుస్తకాల స్టడీ మెటీరియల్ అందించడం ద్వారా పరీక్షలకు మరింత మెరుగ్గా సిద్ధమయ్యే అవకాశం కల్పిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. యువత విలాసాలకు దూరంగా ఉంటూ కష్టపడి చదువుకోవాలని, నిత్యం సాధన చేస్తే అసాధ్యం అనేది ఉండదని అన్నారు. సమయాన్ని వృథా చేయకుండా శిక్షణ కార్యక్రమాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మంచి భోజన, వసతి సౌకర్యాలతో ఉచిత శిక్షణ అందిస్తున్నామని, ఒక యజ్ఞంలా కృషిచేసి ప్రతి ఒక్కరూ పోలీసు ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి గార్ల ప్రత్యేక పర్యవేక్షణతో ఎక్కువ మంది యువత పోలీసు ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శిక్షణ అందించేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తున్నారని అన్నారు. అభ్యర్థులకు ప్రయాణ ఇబ్బందులు లేకుండా కోదాడ, హుజూర్‌నగర్ ప్రాంతాలకు చెందిన 200 మంది అభ్యర్థులకు కోదాడలోనే శిక్షణ ఏర్పాటు చేశామని, జిల్లా వ్యాప్తంగా మొత్తం 400 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందిస్తున్నామని వివరించారు. ఈ శిక్షణకు అభ్యర్థుల ఎంపికలో భాగంగా 1,400 మందికి పరీక్ష నిర్వహించి, ప్రతిభ ఆధారంగా 400 మందిని ఎంపిక చేశామని తెలిపారు. నైపుణ్యం కలిగిన అధ్యాపకులు, అనుభవజ్ఞులైన పోలీసు సిబ్బందితో నాణ్యమైన శిక్షణ అందిస్తున్నామని, అభ్యర్థులు పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఉచిత శిక్షణ అభ్యర్థులకు సైబర్ సెక్యూరిటీపై అవగాహన.. పోస్టర్ ఆవిష్కరణ..
ప్రస్తుత సాంకేతిక యుగంలో స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ వినియోగం విస్తృతంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని సద్వినియోగం చేసుకోవడంతో పాటు సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా సైబర్ సెక్యూరిటీ సెల్ సిబ్బంది అభ్యర్థులకు అవగాహన కల్పించారు. ఆన్‌లైన్ మోసాలు, నకిలీ లింకులు, ఓటీపీ మోసాలు, సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల గురించి వివరించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని మంచికి ఉపయోగించుకోవాలని, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, జిల్లా ఎస్పీ నరసింహ అధికారులతో కలిసి సైబర్ సెక్యూరిటీ అవగాహన పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, తహసిల్దార్ సంతోష్ కిరణ్, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, ఇన్‌స్పెక్టర్లు రామారావు, శివకుమార్, చరమందరాజు, రామకృష్ణారెడ్డి, ఆర్ఎస్ఐలు సాయిరాం, సురేష్, అన్వర్, అధ్యాపకులు, శిక్షణ అందిస్తున్న పోలీసు సిబ్బంది, అభ్యర్థులు పాల్గొన్నారు.
🏠 Home