గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధి ల్లో మెరుగైన పురోగతి సాధించాలి
విద్యా ప్రమాణాల పెంపు, ఐసీడీఎస్ సేవల మెరుగుదలకు సమన్వయంతో పనిచేయాలి
కేంద్ర బృందం సభ్యుడు నోడల్ అధికారి లోకేష్
జోగులాంబ గద్వాల నాలుగు నవంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి. గద్వాల.
జిల్లా పరిధిలోని
గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగవంతం చేసి, నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కేంద్ర బృందం సభ్యుడు,నోడల్ అధికారి లోకేష్ అన్నారు.
బుధవారం ఐడీఓసీ సమావేశ మందిరంలో గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధి సూచికలపై నోడల్ అధికారి లోకేష్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమీక్షించి, అదనపు కలెక్టర్ నర్సింగరావు తో కలిసి బ్లాక్ స్థాయి అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..,గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి,మెరుగైన ఫలితాలు సాధించేలా అధికారులు సమిష్టి కృషి తో పని చేయాలన్నారు.
విద్యారంగంలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించి,పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ప్రత్యేక బోధనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.పాఠశాల స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు విద్యార్థుల చదువు కొనసాగింపుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. బాలురు, బాలికలు ఎవరూ మధ్యలో చదువు మానేయకుండా పటిష్టమైన పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఐసీడీఎస్ కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు అందించాల్సిన పోషకాహారం క్రమం తప్పకుండా అందేలా చూడాలని సూచించారు.గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌లో బ్యాంకింగ్ సేవలు,స్వయం సహాయక సంఘాలు, శిశు ఆరోగ్యం, గ్రామీణ పారిశుద్ధ్యం, అంగన్వాడీ మౌలిక సదుపాయాలు, చిన్నారుల పోషకాహారం,మధుమేహ పరీక్షలు వంటి అంశాల్లో సాధించిన పురోగతిని ఇదే విధంగా కొనసాగిస్తూ,మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ అభివృద్ధికి స్థానిక అవసరాలు, వనరులు, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త ఆవిష్కరణలతో కూడిన వినూత్న ప్రాజెక్టులను అధికారులు గుర్తించి ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.గట్టు బ్లాక్‌లోని ప్రత్యేకత కలిగిన స్థానిక, సంప్రదాయ ఉత్పత్తులను గుర్తించి,వాటి వివరాలతో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, 'ఆకాంక్ష' బ్రాండ్ ద్వారా వాటికి విస్తృత ప్రచారం, మార్కెటింగ్ అవకాశాలు కల్పించి జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకువచ్చేలా కృషి చేయాలన్నారు.తద్వారా స్థానిక కళాకారులు, మహిళా స్వయం సహాయక సంఘాలు, గ్రామీణ ప్రజలకు ఉపాధి, ఆదాయ అవకాశాలు పెంపొందించాలని తెలిపారు. బ్లాక్ అభివృద్ధికి మైక్రోసేవ్ కన్సల్టింగ్ సంస్థతో సమన్వయం చేసుకుంటూ, ఆర్థిక సమ్మిళితం,ఆరోగ్యం, పోషకాహారం,నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ రంగాల్లో సంస్థ అందించే సహకారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు.గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్‌ను అభివృద్ధి సూచికల్లో మరింత మెరుగైన స్థానానికి తీసుకువచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో ఎంపీడీఓ మహ్మద్ అబ్దుల్ సయ్యద్ ఖాన్, డిఆర్డిఓ ముసాయిదాబేగం,
పీఆర్ ఈఈ ప్రభాకర్, జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి సునంద,మిషన్ భగీరథ ఈఈ పరమేశ్వరి, బ్లాక్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.