జాతీయ రహదారిపై ప్రమాదాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి
జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి :- ఉండవెల్లి మండలం జిల్లాలోని ప్రధాన జాతీయ రహదారి అయిన 44వ జాతీయ రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా, ప్రాణనష్టం జరగ కుండా పటిష్ట చర్యలు తీసుకోవ డంతో పాటు అవసరమైన చోట మార్పులు చేర్పులు చేసి తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాస రావు పోలీస్ అధికారులకు, జాతీయ రహదా రి అథారిటీ అధికారులకు సూచించారు.మంగళవారం జిల్లా ఎస్పీ జాతీయ రహదారిని సందర్శించి జిల్లాలోని బీచుపల్లి నుండి అలంపూర్ టోల్ గేట్ వరకు ఉన్న జాతీయ రహదారిని పరిశీలించి ప్రమాదాలు ఎక్కువ గా జరిగే హాట్ స్పాట్ లను డీఎస్పీ మొగిలయ్యతో కలిసి సందర్శించారు. ఈ మధ్యకాలం లో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాలకు గల కారణా లను పోలీస్ అధికారులు ఎస్పీ కి వివరించారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లాలో ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదా రిపై ప్రమాదాలు జరగకుండా నివారించాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టా లని అన్నారు. రోడ్డు ప్రమాదా లను నివారించడానికి అవస రమైన చోట సైన్ బోర్డ్స్, లైటింగ్ ఏర్పాటు చేయాలని, రోడ్డులో ఏమైనా డిఫెక్ట్ ఉంటే అవసర మైన మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అలాగే అవసరమైన చోట వేగ నియంత్రికలు కూడా ఏర్పాటు చేయాలని, ముఖ్యంగా ప్రస్తుతం జాతీయ రహదారిపై ప్రధాన స్టేజీల దగ్గర ఫ్లైఓవర్లు నిర్మాణం అవుతున్నందున అక్కడ ఏర్పాటు చేసే సర్వీస్ రోడ్ల పక్కన సైడ్ స్టాపర్లకు రేడియం స్టిక్కరింగ్ వేయించాలని, రోడ్డుపై వాహనాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిలపకుండా హైవే పెట్రోలింగ్ నిరంతర పర్యవేక్షణ ఉండాలని అన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ మరియు హైవే అథారిటీ అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఎస్పీ వెంట అలంపూర్, శాంతి నగర్ సీఐలు ప్రదీప్, శంకర్, ఎస్ఐలు రవి, తరుణ్ కుమార్, స్వాతి, సురేష్, హైవే ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీధర్, ఇంజనీర్స్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.